Thursday 9 January 2014

హిందూ ధర్మం ఎంతో పురాతనమైనది. ఇతర మతాలూ, నాగరికతలు కళ్ళు తెరవకముందే భారత దేశం హిందూ ధర్మం ఉద్భవించాయి. మన దేశం, మన ధర్మం మనకు ఎంతో ఘనమైన సంస్కృతీ వారసత్వాన్ని ఇచ్చాయి. రామాయణ, మహా భారత, భాగవత గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు.... ఇక అన్నిటిని మించినది భగవద్గిత.. ఈ గ్రంధాలలోని విషయాలు అందరు  చదివి, అర్ధం చేసుకొని. ఆచరించాలి అని మన పూర్వులు ఆశించారు. నిజంగా మనం అలా చేసినట్లయితే మన జీవన ప్రస్థానం ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది. ఎందుకంటే వీటిలో లేని విషయాలు   ఇంకెక్కడా లేవు. వీటిలో ఉన్న విషయాలు అన్నిటా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, భావి తరాల భారతీయుల జీవితాలు సుఖంగా, ప్రశాంతంగా ఉండాలి అని తలచి మన పూర్వులు ఈ గ్రంధాలను సృష్టించారు. ఇప్పుడు మనం నేర్చుకొంటున్న personality  development , crisis management , ఇటువంటివన్నీ మన పూర్వులు ఏనాడో చెప్పారు. అలాగే రాకెట్ తయారీ విధానం, కుక్కర్ తయారీ విధానం వంటివన్నీ అధర్వణ వేదం లో ఉన్నాయి అని అంటారు.

గడచిన దశాబ్దాలలో పాశ్చాత్యులు మన ధర్మం, మన గ్రధాలు మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహనా పెంచుకొని మన పద్ధతులు ఆచరించడం మొదలు పెడితే, మనం పరిపక్వం లేని పద్ధతులను, విచ్చలవిడి తనాన్ని పాటిస్తూ, ఇదే నాగరికత అని, advanced culture అని అనుకుంటున్నాము. కట్టు, బొట్టు ( బొట్టు ఈ దేశం లో ఆడపిల్లలు ఎప్పుడో మానేసారు, అది వేరే విషయం.) మాట, మర్యాద , మన్నన అన్ని మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకొంటుంటే, మనం హాయ్, బై లాంటి పలకరింపులు అలవాటు చెసుకొంటున్నము.

చాలామందిని ఈ మధ్య కాలంలో నేను చూసాను, పురాణాలూ చదవడం అంటే, ఏదో వయసు మళ్ళిన వాళ్ళ పని అన్నటు వ్యవహరిస్తున్నారు. కానీ అది చాల తప్పు అభిప్రాయం. చిన్న తనం నుంచి మనం మన పురాణాలూ చదివితే, వయసు మళ్ళిన తరువాత జీవితం సుఖంగా , ఏ సమస్య లేకుండా సాగడానికి దోహదం అవుతుంది. ఇలాంటి సూక్ష్మాలు ఎన్నో మన గ్రంధాలలో ఉన్నాయి.

(సశేషం)




No comments:

Post a Comment