Sunday 1 March 2015

అమ్మా, అయ్యా, నేను చాలా ఇళ్ళల్లో చూసిన వాటిని, విన్న వాటిని, మరి కొన్ని ఇళ్ళల్లో అనుభవించిన వాటిని గర్హిస్తూ, పిల్లల పెంపకం లో పెద్దలు పాటించ వలసిన అంశాలను ప్రస్తావిస్తున్నాను. మీకు నచ్చితే ఒప్పుకోండి. నచ్చకపోతే, చదవడం మానేయండి. చర్చ ప్రారంభించ వద్దు.
1. పిల్లలు ఎంత చురుకైన వాళ్ళు అయినా, మేధావులు అయినా, ఆడ/ మగ పిల్లలు ఇద్దరికీ కొంచం అయినా ఇంటి పని తెలిసి ఉండాలి.
2. ఇంట్లో అమ్మకు కొంచెం తల నెప్పి వస్తే కనీసం ఒక టీ పెట్టి ఇచ్చే బాధ్యత తెలిసి ఉండాలి.
3. వాళ్ళు ఎంత బిజీ గా ఉన్నా సరే, కాలేజీ/ స్కూల్ నుంచి రాగానే ఒక అరగంట ఇంట్లో అమ్మతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. జరిగిన రోజు గురించి, స్నేహితుల గురించి తల్లితో మాట్లాడే అలవాటు ఉండాలి.
4. ఇంట్లో తల్లితండ్రుల ముఖం చూసి, మాట తీరు చూసి, వాళ్ళు నీరసంగా /అలసటగా ఉన్నారా అని గ్రహించు కోవాలి.
5. ఇంటికి వచ్చిన బంధువులతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి.
6. ఇంటి ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని వ్యవహరించాలి. విద్యార్ధి దశలో ఉండగా ఖరీదైన వస్తువులు, బట్టల కోసం పేచి పెట్టకూడదు.
7. *** ఇప్పటి పిల్లలకు చాలా ముఖ్యంగా నేర్పవలసినది ఏంటంటే, స్నేహితుల తోనూ, పెద్దలతోనూ, బంధువులతోనూ, ఒకేలా మాట్లాడకూడదు అని, ఎవరి స్థాయిని బట్టి వారితో సంభాషించాలి అని.
8. ఏ విషయం లో అయినా, నీకేం తెలుసమ్మా దీని గురించి, అని తల్లి తండ్రులను చిన్నబుచ్చే అలవాటును పిల్లలలో మొగ్గ లోనే తున్చేయండి.
పిల్లలు సరి అయిన మార్గం లో నడవాలి అంటే, పెద్దలు ముందు అలా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ అన్ని కనీస మర్యాదలను మీరు పిల్లలకు నేర్పించాలి.

1 comment:

  1. హలో,

    ఈ Mrs Rahel, ఒక ప్రైవేట్ ఋణం ఇచ్చేవారు ఏ ఆర్థిక సహాయం అవసరం ప్రతి ఒక్కరికీ ఒక ఆర్థిక అవకాశం తెరుచుకుంటుంది కలిగి సాధారణ ప్రజలకు తెలియజేస్తోంది. మేము స్పష్టమైన మరియు అర్థవంతమైన నియమాలు మరియు నిబంధనలను ఒక కింద వ్యక్తులు, సంస్థలు మరియు సంస్థలు 2% వడ్డీ రేటు వద్ద అప్పు ఇచ్చుకుంటారు. ఇ-మెయిల్ ద్వారా మాకు నేడు మమ్మల్ని సంప్రదించండి: (rahelcohranloan@gmail.com)

    ReplyDelete