Friday 1 May 2015

వైశాఖ మాస ప్రాశస్త్యం

మేష, తుల, మకర, సంక్రమణ కాలాలు, స్నానానికి విశిష్టమైనవి. మాసం లో నల్ల తులసి, తెల్ల తులసి రెండూ కూడా విష్ణు పూజకు యోగ్యమైనవే. శ్రీహరికి ఇష్టమైన అశ్వద్ఠ మూలాన్ని  నీటితో తడపడం కూడా పుణ్యదాయకమే. స్నానానంతరం అశ్వధ్ధ పూజ కూడా ఉత్తమం.

ఆవును వెనుక భాగమున నిమిరి, అటుపైన స్నానం చేసి, పిప్పల తర్పణం చేసి, గోవిందుని అర్చించిన వారికి ఎన్నడూ దుర్గతులు సంభవించవు. యధాశక్తి నక్తం, ఏకభుక్తం, అయాచితం, వీనిలో ఎదైనా ఆచరించే వారికి కోరిన కోరికలన్నీ సిధ్ధిస్తాయి. వైశాఖం లో చలివేంద్రాలు నిర్వహించడం, పరమశివునికి, లింగమూర్తికి, గలంతిక ( నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాటు) పితృదేవతల తృప్తికై చెప్పులు, విసనకర్ర, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, ఘట పూరిత జలం, పూలు, పండ్లు, దానం చేయడం, అన్ని విధాలా మేలు కలిగిస్తాయి. మాసం నెల రోజులూ స్నానం ఆచరించలేని వారు కేవలం మూడు రోజులు స్నానాన్ని ఆచరించడం లో తప్పు లేదు. తిథులు ఏమిటంటే, శుక్ల పక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. మూడు రోజుల్లో స్నానం అచరించుట వలన పాపములు నివృత్తి కాబడతాయి.

అక్షయ తృతీయ.

వైశాఖ శుధ్ధ తృతీయ ను అక్షయ తృతీయ అంటారు. కృతయుగం ఈనాడే ప్రారంభమైందని చెప్తారు. రోజున చేసేపూజలు, హోమము, దానము. పితృతర్పణము అక్షమయైన పుణ్యఫలాని ఇస్తాయిఈరోజున నీటితో నిండిన కుండ, గోధుమలు, శనగలు మొదలగు ధాన్యాలు, పెరుగన్నం దానం చెయడం వలన శివసాయుజ్యాన్ని పొందవచ్చూని భవిషయ పురాణం, దేవీపురాణం చెబుతున్నాయి. గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారము, వస్త్రాలను దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. కొన్ని ప్రంతాలలో రోజున గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణునికి చందన లేపనం చేసే సంప్రదాయం కూడా ఉంది.

పరశురాముని కథ:


జమదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు. రేణుకా దేవి ఒకరాజుని మోహించిందని భావించి, జమదగ్ని ఆమెను వధించమని కొడుకులను ఆదేశించాడు. మిగిలిన వారు నిరాకరించగా, పరశురాముడు, తండ్రి ఆజ్ఞ నిర్వర్తించాడు. తండ్రి సంతోషించి, వరం కోరమంటే, తల్లిని బ్రతికించమని, సోదరులను మన్నించమని అడిగాడు. తండ్రి అతని కోరిక తీర్చాడు. తరువత పరశురాముడు తాత రుచీకుడి వద్దకు వెళతాడు. రుచీకుడు మనవడి తీరుతెన్నులు గమనించి, తపస్సు చేయమని సూచిస్తాడు. పరశురాముడు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరమన్నడు. రౌద్రాస్త్రం ఇమ్మని అడిగాడు పరశురాముడు. అంత అస్త్రాన్ని భరించగల శక్తి నీకు లేదు అన్నాడు శివుడుపరశురాముడు తపస్సు కొనసాగించాడు. అంతలో దానవులు దేవలోకం మీద దాడి చేశారు. శివుడు పరశురాముని రప్పించి దానవులను తరిమేసే బాధ్యతను అప్పగించాడు. నా దగ్గర ఆయుధం లేదే అన్నాడు పరశురాముడు. అప్పుడు శివుడు అతనికి పరశువు ( గొడ్డలి) ఇస్తాడు. పరశురాముడు దానవులను తరిమికొట్టి, మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. శివుడు మరోసారి ప్రత్యక్షమై అతడు కోరిన అస్త్రాలన్నీ ఇచ్చాడు. తర్వాత, వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు అనే రాజు సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. జమదగ్ని తన వద్దనున్న కామధేనువు వల్ల అన్ని పదార్థాలు పొంది, రాజుకు విందు చేశాడు. రాజు కామధేనువును అపహరించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని భటులు సంహరించారు. భృగు మహర్షి వచ్చి జమదగ్నిని మరల జీవింపచేస్తాడు. కార్తవీర్యుని దురాగతం తెలుసుకున్న పరశురాముడు, ఇరవై ఒక్క సార్లు దండెత్తి, కార్తవీర్యునితో సహా రాజులందరినీ వధించాడు. అలా సంపాదించిన భూమిని కశ్యపునికి దానం చేసేసి, హింసకు ప్రాయశ్చిత్తంగా తండ్రి సూచనపై తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంతటి మహాతపశ్శాలి జయంతిని మనం యుగయుగాలుగా వైజశాఖమాసం లోని తదియ నాడు రుపుకుంటున్నాం.   

No comments:

Post a Comment