కార్తీక మాస ప్రాశస్త్యం:
మన సంప్రదాయంలో కార్తీకమాసానికి
ఎంతో విశిష్త
ఉంది. ఈ
మాసాన చేసే
భగవత్పూజలు, వ్రతాలు, స్నానాలు, దీపారాధనలు గొప్ప
ఫలాన్ని ప్రసాదిస్తాయి.
ఈనెలలో విష్ణువు
"దామోదర" నామంతో పూజింపబడతాడు.
అందువల్ల ఈ మాసాన ఏ సత్కార్యం
చేసినా, "కార్తీక దామోదర ప్రీత్యర్ధం" అని సంకల్పించి చేయాలి. ఈ
మాసముతో సమానమైన
మాసము లేదంటూ
అత్రి మహర్షి,
అగస్త్యునితో చెప్పాదు. ఈ నెలరోజులు, రోజుకొక
అధ్యాయం చొప్పున
కార్తీక మహాత్మ్యం
పఠనం, శ్రవణం
భారతావని అంతా జరుగుతుంది. నదీస్నానం, ఉపవాసం,
పురాణ పఠనం,
దీపారాధన, దీపదానం, సాలగ్రామపూజ, దైవపూజ, వనభోజనములు,
కార్తీక మాసంలో
నిర్వర్తించవలసిన ముఖ్య విధులుగా
చెప్పబడుతున్నాయి.
నెలలొ పూర్ణిమ నాడు
ఏ నక్షత్రం
దగ్గరగా చంద్రుడు
ఉంటే ఆ
నెలకు ఆ
నక్ష్త్రం పేరు రావడం మన ఖగోళ
మాన సంప్రదాయం.
ఈ పధ్ధతి
ప్రకారం శర్దృతువులో
చంద్రుడు పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం
దగ్గర ఉంటాదు.
అందుకే ఇది
కార్తీక మాసం.
కృత్తికా నక్ష్త్రం ఆరు
నక్షత్రాల కూటమి.ఇది దర్భ పొదల
మాదిరిగా ఉంటుంది. శివుని వీర్యం నీటిలో
పడి ఈపొదల
మధ్య చిక్కుకోగా
ఆరుగురు కృత్తికలు
కల్లిసి దాన్ని
ఏకం చేసి
బిడ్డగా పెంచినట్టు
పురాణ కథ.
అతడే కార్తికేయుడు,
అయ్యాడు. తారకాసుర సంహారం చేసాడు. ఈ
విధంగా కృత్తికలు
శివునికి ప్రీతిపాత్రులయ్యారు. వారి
పేరున ఏర్పడిన
కార్తీక మాసం
అంటే శివునికి
ఎక్కువ ఇష్తం.
కనుకనే ఈ
మాసంలో దేశవ్యాప్తంగా
శివార్చనలు వైభవంగా జరుగుతాయి.
ఈ మాసములో
చెరువుల యందును,
దిగుడు బావుల
లోను, పిల్లకాలువల
యందును హరి
నివసించి ఉంటాదు అని శాస్త్రం.ఆవుపాదమంతటి
జలంలో కూదా
ఈ మాసంలో
హరి నివసిస్తాడుత.
అందుకే సూర్యోదయానికి
పూర్వమే శిర:స్నానం చేయాలి.
దీపారాధన చేసి, శివునికి, విష్ణువుకు, సుబ్రహ్మన్యస్వామికి
పూజచేస్తే, విశేష ఫలప్రదము.
సోమవారాలు.
ప్రతి సోమవారము శివవ్రతానికి
ఉత్తమమే కాని,
ప్రత్యేకించి కార్తీక సోమవారాలు సర్వవిధాల శ్రేష్టం.
ఈరోజు ఉదయాన్నే
శివారాధన, అభిషేకదులు చేసుకుని, పగలంతా ఉపవాసం
ఉండి, సాయంత్రం
తిరిగి శివునికి
పూజ చేసి,
అన్నాదులు నివేదన చేసి, నక్షత్ర దర్శనం
చేసి ఆ
ప్రసాదాన్ని ఆరగించాలి. ముఖ్యంగా దీపారాధన స్నానానంతరం
పొడిబట్టలతోనే చేయాలి.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment