ఆషాఢ మాసం ప్రాశస్త్యం:
ఆషాఢ శుక్ల విదియ
జగన్నాధ రథోత్సవం.
స్కాందపురాణం ప్రకారం ఈ విదియ రోజున
పుష్యమీ నక్షత్రాన సుభద్రా
బలరాములను రథముపై ఊరేగిస్తారు. కళింగ ప్రాంతమున
(నేటి ఒరిస్సా)
పూరీజగన్నాధ క్షేత్రములో లోకకళ్యాణార్ధమై
రథయాత్ర నిర్వహించబడుతుంది.ముగ్గురు దైవాలు
మూడు రథములపై
ఊరేగే ఈ
సంప్రదాయక ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా
ప్రసిద్ధి చెందినది. ఈ విదియ
రోజు, ఆదినారాయణునకు
రథయాత్ర ఎంతో
ప్రీతికరమైనది అని శాస్త్రవచనాలు చెప్తున్నాయి.
శయనైకాదశి (తొలి ఏకాదశి)
ఆషాఢ శుధ్ధ ఏకాదశిని
తొలి ఏకాదశి,
శయనైకాదశి అంటారు. ఈ ఏకాదశి నుండి,
కార్తీక శుధ్ధ
ఏకాదశి (నాలుగు
నెలలు ) వరకు
చేసే వ్రతం,
చాతుర్మ్యాస వ్రతం. ఈ వ్రతం చేసేవారు
గుడం,( బెల్లము
) తైలం, కాల్చి
వండిన పదార్థాలు,
మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చెరకు, కొత్త
ఉశిరిక, చింతపండు,
శయ్యాశయనం (మంచముపై శయనించుట),పరాన్నం, తేనె,
పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు,
తీసుకోరాదు. నిమ్మ, రాజమాషములు (రాజ్మా) ముల్లంగి,
ఎర్రముల్లంగి, అలసందలు, విష్ణువుకు నివేదించని
పదార్థములు తీసుకోరాదు. భగవత్పూజలో
కాలం గడపాలి.
ఈ పుణ్యదినాన
విష్ణువు పాలసముద్రములో పవ్వళీస్తాడు
అని, కార్తీక
శుధ్ధ ఏకాదశి
నాడు మరల
భక్తులను రక్షించుటకై మేలుకొంటాడు
అని శాస్త్రవచనం.
ఈ చాతుర్మ్యాస
వ్రతములో మొదటి ఏకాదశి కనుక ఈ
ఏకాదశిని తొలి ఏకాదశి అని పేరు.
ఈ చాతుర్మ్యాస వ్రతము
లో శ్రావణమాసము,
కూరలను (శాకములు
), బాధ్రపద మాసమున పెరుగును, ఆశ్వయుజ మాసమున
పాలును, కార్తీక
మాసమున పప్పు
పదార్థములను విసర్జించాలి.
వ్యాసపూర్ణిమ:
వేదవ్యాసుని జయంతి ఈరోజు,
తొలిగురువు వ్యాస మహర్షులవారే కనుక ఈరోజు,
వ్యాసుల వారితో
పాటు, ప్రజలు
తమ తమ
గురువులను కూడా పూజించాలి.చదువులు చెప్పే
గురువులను, మంత్రోపదేశం చేసే గురువులను యథాశక్తి
అర్చించాలి. వారి వారి గురుపరంపరను పూజించాలి.
సన్యాసులైన వారు, ఈ పూర్ణిమానాడు చాతుర్మ్యాస
వ్రతం ఆరంభించి,
ఈ నాలుగు
నెలలూ, ఎక్కడికీ
సంచారం చెయకుందా,
ఒకచోట స్థిర
నివాసం చేయాలి.
No comments:
Post a Comment