Friday 1 May 2015

ఆశ్వయుజ మాసం ప్రాశస్త్యం:

నక్షత్రలలో మొదటిది అశ్విని. నక్షత్రంతో కూడిన పూర్ణీమ కల మాసమిది. అంటే ఒక విధంగా ఇక్కడినుండి కొత్త సంవత్సరం ఆరంభం ఔతున్నట్లే! ఇలాగే చైత్రం కూడా! అందుకే రెండు నెలల్లోనూ మొదటి తొమ్మిది రోజులు ( శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ) అమ్మవారిని ఆరాధిస్తారు. నవరాత్రులలో జగదంబను ఆరాధించేవారికి సరమంగళములూ సంప్రాప్తిస్తాయి. నవరత్రికి దీక్షతో నిర్వహించే పూజలు సాత్వికం, రాజసం, తామసం అని మూడు రకాలు. సాత్విక పూజ మోక్షాన్ని ప్రసాదిస్తుందని, రాజసపూజ సంపద, పదవి, ధనం వంటి వాటిని కలుగచేస్తుందని, తామసిక పూజ ప్రయోజనం మధ్యమం అని శాస్త్ర వచనం. సంప్రదాయ సిధ్ధంగా పధ్ధతిగలవారు కలశాన్ని స్థాపించి ముగురమ్మల మూలపుటమ్మను ఈనాటి నుండి తొమ్మిది రోజులపాటు నియమంగా ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు చేయలేని వారు 5 రోజులు కాని, 3 రోజులు కాని లేదా ఒక్క రోజు కాని చేయవచ్చు. పూజతో పాటు ఒకపూట భోజనం చేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఆశ్వయుజ మాసం అష్తమి నవములందు జగన్మాతయైన అంబికను పూజించిన నరుడు శోకం లేని వాడు ఔతాడు.

సరస్వతీ పూజ:

మూలా నక్ష్త్రంలో సరస్వతిని ఆరాధించాలి. తొమ్మ్మిది రోజులు పూజ చేయలేని వారు ఈనాటినుండి నవమి వరకు మూడు రోజులపాటు అయినా ఆరాధించాలి.మనిషిని   మూఢత్వమనే జడత్వం నుంచి వ్జాన వికాసం వైపు నడిపించేది "చదువు". చదువును అందించే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యల రాణి, పుస్తకపాణిని అయిన జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

మహానవమి:

నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహానవమి. రోజున జగదంబను ఆరాధించి తీరాలి. తొమ్మిది రోజులూ పూజ చెయలేని వారు అష్టమి, నవమి, దశమి నాదైనా పూజించాలి. అందులో ప్రధానమైనది నవమి పూజ.

విజయదశమి:

నవరాత్రులలో చివరి రోజు అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. పూర్వం జయాన్ని కోరే రాజులు ఈనాదే యుద్ధానికి వెళ్ళేవారని చరిత్ర వల్ల తెలుస్తోంది. రోజుల్లో వాతావరణం మరీ ఎక్కువ చల్లగా, మరీ ఎక్కువ ఎండగా లేక, వర్షముల వలన ఏర్పడిన బురద ఆరిపొయి, ప్రయాణమునకు అనువుగా ఉంటుంది. వరదలు, వాగులు, నదులు, ప్రవాహవేగము తగ్గిదాటుటకు అనువుగా ఉంటాయి. అందుకే, దసరా రోజున అపరాజితా పూజ ముగించి, యుద్ధ ప్రయాణములకు సిధ్ధంగా ఉండేవారట రాజులు.

ఈరోజున శమీవృక్షమును పూజించి, చెట్టు ఆకులను ఒకరికొకరు ఇచ్చుకొని ఆలింగనము చేసుకోవడం పెద్దవారికి ఇచ్చి వారి నుంచి ఆశీస్సులు అందుకోవటం నేటికీ తెలంగాణ ప్రాంతం లో ఆచారం లో ఉంది.

అపరాజితా పూజ:

ఈరోజున అపరాజితా దేవిని పూజించలేని వారు "అపరాజితాయై నమ:, జయాయై నమ:, విజయాయై నమ:" అనే నామాలు చదివినా శుభకరమే. ప్రయాణానికి వెళ్ళినా నామాలు పఠిస్తే, విజయం ప్రాప్తిస్తుంది. నవమి, దశమిలందు అపరాజితను పూజించడం వలన విజయము సిధ్ధింపగలదని పురాణోక్తి. .
ఇది



No comments:

Post a Comment