ఒక మంచి కథ.
అనగనగా ఒక ఊళ్ళో ఒక దుందుడుకు అబ్బాయి ఉండేవాడు. అందరితో పరుషంగా మాట్లాదేవాడు, దుడుకుగా ప్రవర్తించేవాడు. వాడిని మార్చడానికి వాళ్ళ నాన్న చేసిన ప్రయత్నాలు ఎన్నో విఫలం అయ్యాయి. ఒకసారి అతను ఒక సంచీడు మేకులు తెచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి, "బాబూ! నీ ప్రవర్తనతో ఇప్పటికే నేను విసిగిపోయి ఉన్నాను. ఈసారి నుంచి నీకు ఎవరిమీదనైనా కోపం వచ్చినపుడు, ఏదైనా అల్లరి పని చేసినపుడు ఈ సంచిలోని మేకులు ఒక్కొక్కటి ఈ కనబడే గోడకు కొట్టు." అని చెప్పాడు. ఆ అబ్బాయికి ఏమి అర్ధం కాకపోయినా, తండ్రికి సరే అని చెప్పి మేకులు తీసుకున్నాడు. మొదటిరోజున అతను 37 మేకులు గోడకు కొట్టాడు. కొన్ని వారాల తర్వాత అతను ఎంతో ప్రయత్నం చేసి, తన దుడుకు స్వభావాన్ని మార్చుకోగలిగాడు. అందువలన గోడకు కొట్టే మేకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. గోడకు మేకులు కొట్టేకన్నా, తన స్వభావం మార్చుకోవడమే తేలికగా ఉంది అని అతను అనుకున్నాడు. ఆఖరికి ఒక రోజు అతను పూర్తిగా సాధుస్వభావి అయ్యాడు. అదే విషయం అతను తన తండ్రికి తెలియచేశాడు. అప్పుడు తండ్రి ఆ అబ్బాయితో "ఇక ముందు నువ్వు నీ దుడుకు తనాన్ని, కోపాన్ని, అల్లరిని నిగ్రహించుకోగలిగి నపుడల్లా గోడనుంచి ఒక్కొ మేకును తీసేయి" అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లే చేస్తూ కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయి మేకులన్నిటినీ గోడనుంచి తీసేయగలిగాడు. ఆ విషయం తండ్రితో చెప్పాడు. అప్పుడు తండ్రి అతని చేయి పట్టుకుని, గోడ దగ్గరకు తీసుకువెళ్ళి, " చూసావా నయనా! నువ్వు మేకులు తీసివేసినప్పటికీ గోడలో ఆ మచ్చలు ఉండిపొయాయి. అలాగే, నువ్వు ఎవరినైనా మనసు నొప్పిస్తే తరువాత క్షమాపణ చెప్పినప్పటికీ, వారి మనసులో ఆ మచ్చ అలాగే మిగిలిపొతుంది ఈ గోడకు ఉన్న మచ్చ లాగానే.... నిన్ను ప్రేమించేవారి మనసుకు ఒక్కసారి గాయం అయినతరువాత, నువ్వు నీ తప్పును సరిదిద్దుకున్నప్పటికీ, వారి మనసులో గాయం అలాగే ఉండిపోతుంది. శరీరానికి తగిలిన గాయం కంటే, మనసుకు తగిలే గాయం లోతుగా ఉంటుంది." అని చెప్పాడు. ఆ అబ్బాయికి సత్యం తెలిసింది. కనువిప్పు కలిగింది.
మనంకూడా ఎన్నొసార్లు ఇలాగే ప్రవర్తించి ఉంటాము, మన స్నేహితుల పట్ల, మన శ్రేయోభిలాషుల పట్ల. స్నేహితులన్నవారు మనిషికి నిజంగా ఎంతో విలువైన సంపద. నిజమైన స్నేహితులు ఎప్పుడూ మనలను ప్రోత్సహిస్తారు, మనస్పూర్తిగా మన క్షేమాన్ని కాంక్షిస్తారు. మన కష్టాలలో తోడుంటారు. మన చుట్టూ మనలను ప్రేమించే స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ ఎవరి మనసునూ కష్టపెట్టకండి. ఎవరి బాధకూ మీరు కారణం కాకండి.
ఒకవేళ మీ హృదయంలో బాధకు నేను ఎప్పుడైనా కారణం అయితే, నన్ను క్షమించండి.
ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
ReplyDeleteమహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*