Friday 1 May 2015

వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి జరిగింది అని శాస్త్రాలు చెప్తున్నయి. మరల ఈనాడే క్రోధితుడైన జహ్ను మహర్షి గంగను తాగేసి, మరన గంగ వేడుకున్న మీదట కుడి చెవి నుంచి వదిలాడు . జహ్ను మహర్షి చెవి నుండి వెలువడిన గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. వైశాఖ శుధ్ధ సప్తమి నాడు గంగాదేవి ఆవిర్భవించినట్లు శాస్త్రాలు పేర్కొన్నాయి. అయితే, భగీరథుని తపస్సు కారణంగా జ్యేష్ట శుధ్ధ దశమినాడు గంగ భూలోకాన్ని చేరింది. అందుకే రోజు  గంగానదిలో స్నానం చేయడం, చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. గంగాదేవిని స్మరిస్తూ, పుణ్య నదుల్లో స్నానం చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. జ్యేష్ట శుధ్ధ దశమిని దశపాపహర దశమి అని పిలుస్తారు. ఈరోజున గాంగ దేవిని స్మరించడం, పూజించడం ద్వారా అశేష ఫలితాలను పొందవచ్చు. గత జన్మల నుండీ ఉన్న సంచిత పాపములను కూడా తొలగించుకోవచ్చు.

No comments:

Post a Comment