Friday, 1 May 2015

శ్రావణమాస ప్రాశస్త్యం:

శ్రావణ పంచమి; ఈరోజును నాగపంచమి అని కూడా అంటారు. ఈరోజు ఉత్తరభారత దేశంలోనూ, దక్షిణ భారతం లో కొన్నిచోట్ల నాగదేవతలకు పూజలు చేసి, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. జైన పురాణాలలో కూడా నాగపంచమి ప్రసక్తి ఉంది.

వరలక్ష్మి వ్రతం: ఈమాసం లో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు అన్ని వర్ణాల మహిళలు ఆచరించే మహత్తరమైన పూజ వరలక్ష్మి వ్రతం. శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈపూజను మహిళలు అందరూ యధాశక్తి చేసుకుంటారు.

రాఖీ పౌర్ణిమ: తమ రక్షణ కోరుతూ, సోదరీమణులు వారి అన్నదమ్ములకు రక్షాబంధనం చేసేది రోజే. ఉపనయనం చేసుకున్న ప్రతివారూ ఈరోజు పాత జంధ్యములు తీసివేసి, కొత్తవి ధరిస్తారు. పూర్ణిమను జంధ్యాలపూర్నిమ అని కూడా అంతారు.

శ్రీకృష్ణాష్తమి: వెన్న దొంగ, నల్లనయ్య అయిన కృష్ణుడు జన్మించిన రోజును దేశ ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పాలు, పెరుగు, అటుకులు, మిఠాయిలు నైవేద్యం సమర్పిస్తారుదేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ మందిరాలలో అర్చనలు చేస్తారు. సాయంత్రం వేళల్లో, దేవదేవుని స్మరించుకుంటూ, ఉట్లు కొడతారు.

పోలాల అమావాస్య:

 శ్రావణ అమావాస్య ను పోలాల అమావాస్యగా చెప్తారు. పోల అంటే ఎద్దు. కాబట్టి పండుగ పశువులకు సంబంధించిన పండుగగా చెప్పబడుతోంది. ఎక్కువగా రైతులు దీన్ని ఆచరిస్తారు. రోజున ఆవులను, ఎద్దులను పూజించాలని శాస్త్ర వచనం. రైతులు తమ వద్ద పనిచేసే కూలీలకు రోజుననే కూలి కొలిచేవారు. అంటే, ముందటి పోలాల అమావాస్య నుండి ఈరోజు వరకు కూలి లెక్క వేసేవారు. అంటే, రైతులకు ఇది నూతన సంవత్సరంతో సమానం. రాను రాను పోలేరమ్మ అనే గ్రామదేవత పూజగా కూదా జరుపుకోవడం ప్రారంభించారు. అమావాస్య నాడు పోలాంబ (పోలేరమ్మ)ను ప్రత్యేకంగా కొలుస్తారు. కొన్ని చోత్ల కందమొక్కను పూజిస్తారు. కందమొక్కకు ఎంత త్వరగా పిలకలు వచ్చి మొక్కలు వస్తాయొ, అంత త్వరగా ఇంద్లలో పసిపాపలు పారాడాలి అని, పుట్టిన పిల్లలు అరిష్టాలు లేకుండా చల్లగా పెరగాలి అని పూజను చేస్తారు.

No comments:

Post a Comment