ప్రతీపుడనే రాజుకు పెద్దవయసు వచ్చినా పిల్లలు లేకపోయేసరికి వృద్ధాప్యంలో భార్యతో కలిసి తపస్సు చేసాడు. ఫలితంగా కొడుకు పుట్టాడు. అతనికి శాంతనవుడు అని పేరు పెట్టాదు. ప్రతీపుడు గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు గంగాదేవి మానుషరూపం లో వచ్చి, అతని కుడి తొడ మీద కూర్చుని నన్ను పెళ్ళి చేసుకో అని కోరింది.ఎడమతొడ భార్య స్థానం. కుడి తొడ పిల్లల స్థానం. అందుకని ప్రతీపుడు, నువ్వు నా కుమారుడిని పెళ్ళి చేసుకొవచ్చులే అని చెప్పి పంపేసాడు.
శాంతనుడు క్రితం జన్మలో మహాభిషుడు అనే రాజు. బ్రహ్మ సభకు వెళ్ళి అక్కడ గంగను చూసి మోహిస్తాదు. బ్రహ్మ కోపించి, మానవ జన్మలో పుట్టి మళ్ళీ బ్రహ్మ లోకనికి వస్తావు అని శపించి, గంగను మోహించావు కనుక ఆమెయే నీ భార్య అవుతుంది. కాని నీకు అనుకూలంగా ఉండదు అని శపించాడు.
అష్ట వసువులలో ఆఖరివాడు అయిన ద్యుమంతుడు అనేవాడు భార్య మెప్పు కోసం, తన అన్నదమ్ములైన మిగిలిన ఏడుగురు వసువులనూ తోడు తీసుకుని, వశిష్ట మహర్షి ఆశ్రమంలోని హోమధేనువును దొంగ్లిస్తాడు. వారిని మనుషులుగా పుట్టమని శపిస్తాడు. మనుషులలో పుట్టడం శాపం ఎందుకు అవుతుంది అంటే, మానవ జన్మలో కర్మ బంధాల్లో చిక్కుకోవడమూ, మమకారాలు, బంధుత్వాలు అనే మాయలో చిక్కుకోవడమూ మానవ జన్మ లోనే జరుగుతుంది. శాపవిమోచనం అడిగిన వసువులతో వశిష్టుడు ఇలా చెప్తాడు. " మీ అందరూ ఒక్కొ సంవత్సరం ఒక్కొక్కళ్ళూ చొప్పున మోక్షాన్ని పొందుతారు. పాపకార్యంలో అసలు ముద్దాయి అయిన ద్యుమంతుడు మరిన్ని రోజులు భూలోకంలో ఉంటాడు. స్త్రీ కారనంగా పాపం చేసాడు కాబట్టి, అతనికి అప్పుడు స్త్రీ సౌఖ్యం, భార్య పిల్లలు ఉండరు అని చెప్తాడు.
దిగాలు పడిన వసువులు బ్రహ్మ సభనుంచి వస్తున్న గంగాదేవిని కలుసుకుని, ఇది మా కథ. ప్రతీపుని కొడుకు శాంతనవుని మేము తండ్రిగా చేసుకుంటాము, నువ్వు మాకు తల్లివై, మానవ లోకం నుంచి మేము బ్రహ్మ లోకానికి త్వరగా వచ్చేలా సహాయం చెయ్యాలి అని ప్రర్ధించారు.
ప్రతీపుడు శాంతనవుడికి రాజ్యం అప్పగించి అడవులకు వానప్రస్థం వెళ్ళిపోయాడు. శాంతనవుడు రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకు వెళ్ళి అలసిపోయి గంగానది ఒడ్డున సేదతీరుతున్నాడు. అక్కడికి గంగానది స్త్రీ రూపం లో వచ్చింది. ఇద్దరి మధ్యా మోహం కలిగింది. పెళ్ళికి గంగ ఒక షరతు పెట్టింది. నేను చేసే ఏ కార్యానికి నువ్వు అడ్డు చెప్పకూడదు అని. మోహంలో ఉన్న శాంతనవుడు అన్ని షరతులకూ ఒప్పుకున్నాడు.
ప్రతి యేడాదీ తనకు పుట్టిన కొడుకులను " నీకు మాట ఇచ్చినట్టుగానే నీకు శాపవిమోచనం చేస్తున్నాను" అని గంగ ప్రతి బిడ్డని నీళ్ళల్లొ వదిలిపెట్టేసేది. ఏడుగురిని అలా మోక్షం కలిగించిన తర్వాత ఇక ఆగలేక ఎనిమిదో బిడ్డను గంగ తీస్కెల్తుంటే అడ్డుకున్నాడు శాంతనవుడు.
నీకు, నాకు ఋణం తీరిపోయింది కనుకనే, నువ్వు నా పనులను అడ్డుకున్నావు. వీరందరూ వసువులు. వారిని శాపం నుంచి నేను విముక్టులను చేసాను. ఇంకా ఇతగాడి శాపం ఉండిపోయింది. నీతో ఉంచుకో అని ఆమె వెళ్ళిపోయింది. ఆ బాలుడే భీష్ముడు.
శాంతనవుడు మళ్ళి దాసరాజు కుమ్మర్తె సత్యవతిని మోహించినపుడు, తన పిల్లలు మాత్రమే రాజు కావాలి, రాజ్యం చేయాలి అని కోరింది. ప్రతిగా భీష్ముడు సంతానానికి కారణం అయిన వివాహాన్ని కూడా వద్దు అనుకున్నాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి, నిలుపుకున్నాడు కాబట్టే భీష్ముడు అయ్యాడు. ఇతని పిత్రుభక్తికి మెచ్చిన శాంతనవుడూ కొడుకుకు స్వచ్చంద మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.
నేను, నా అనే అహంకారాలను జయించాడు కాబట్టే, రాగద్వేషాలకు అతీతంగా ధర్మబధ్ధంగా వ్యవహరించి, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాడు భీష్ముడు.
ఇదీ భీష్ముడి కథ.

No comments:
Post a Comment