Monday 24 February 2014

ప్రఖ్యాత తెలుగు నవల, కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1891 లో తూర్పు గోదావరి జిల్లా పొలమూరు లో జన్మించారు. ఆయన సుమారు 75 కథలు, అనేక నాటకాలు, నాటికలు, నవలలు, అనువాదాలు వ్రాసారు.

ఆయన కథలలో 'గులాబీ అత్తరు' కథలో కళాపిపాస, భావ సౌందర్యం లేని చోట ఎంత విలువైన వస్తువైనా చిన్నబోతుంది అనే విషయం ఎంతో హృద్యంగా చెప్పారు.

ఇక వడ్లగింజలు అనే కథ, 'మనకి ఏ విషయం లోనైనా సామర్ధ్యం ఉంటె చాలదు, దానిని వెలికితీసే ఒక mentor మనకి కావలి అనే విషయం చెప్పారు. ఈ కథలో శంకరప్ప అనే ఒక చదరంగ ఆటగాడికి తను బస చేసిన పూటకుళ్ళమ్మ తన తెలివితో, ఎలా ప్రోత్సహించిందో తెలుసుకోవచ్చు.

ఇక ' మార్గదర్శి' కథ ఈరోజుల్లో కూడా మనకి ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ లాగా పనికొస్తుంది. ఇందులో ఒక బ్రాహ్మణ పిల్లడు, ఒక కోమట్ల కుర్రాడు ఎలా తమ దగ్గర ఉన్న అణా డబ్బుని ఉపయోగించారు అనే విషయంతో మొదలుపెట్టి ఆ బ్రాహ్మణ కుర్రాడు తమ వర్గానికి ఏమాత్రం సరిపడని 'వ్యాపారం' లో కోమట్ల కన్నా అధికంగ పేరు, డబ్బు సంపాదించాడు అని చాల అద్భుతం గ చెప్పారు. బిజినెస్ చేద్దాము అనుకునే వాళ్ళు అందరికి ఎరోజుకి కూడా ఇది ఒక మంచి పాఠం

ఇది రెండవ సంపుటి. ఇందులోనే ఇంకా 3 కథలు ఉన్నాయ్. చదవని వాళ్ళు తప్పకుండా చదవండి. ఇప్పటికే చదివిన వాళ్ళు తమ అభిప్రాయం చెప్పండి.

No comments:

Post a Comment