Monday 24 February 2014

విశాఖపట్నం లోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. ఈ అమ్మవారు స్థానికంగా ఉన్న ఒక బావిలో దొరికిందని, ఆ విగ్రహానికి 1912లొ స్థానిక రాజులు కోవెల కట్టించారని ప్రతీతి.

ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మొత్తం మాసం లో దాదాపు 10 లక్షల మంది భక్తులు వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకూ సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా నమ్ముతారు.

మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం, అంటే గురువారం ఈ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు.

ఇక్కడ జరిగే అన్నదానంలో పాల్గొనడాన్ని అన్నదాన ప్రసాదం స్వీకరించడాన్ని భక్తులు తమ పుణ్యంగా భావిస్తారు. మార్గశిర మాసంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది. లక్ష్మివారం నాడు విశేషించి భక్తులు అన్నదానంలో పాల్గొంటారు.

మార్గశిర లక్ష్మివారమ్ సాధారణ రోజువారీ పూజలే కాక, విశేష పూజలు, విశేష అభిషేకాలు, లలిత సహస్ర పారాయణ, భగవద్గిత పారాయణ, హరికథ కాలక్షేపం వంటివి కూడా నిర్వహించబడతాయి.
ఈ రోజు వార్త.

డిసెంబర్ 7 మధ్య రాత్రి( తెల్లవారితే ఆదివారం ) 1.30 నిముషాలకు ముంబై లో ఒక austo -martin కారులో ఒక యువకుడు అర్ధరాత్రి వరకు జరిగిన పార్టీలో పికల వరకు తాగి కారు నడుపుతూ పెద్దర్ రోడ్ లో ఆక్సిడెంట్ చేసి, ఇద్దరి మరణానికి కారకుడయ్యాడు. ఈ సంఘటనలో మరో 8 మంది తివ్రగాయాల పాలయ్యారు. ఆ ఆక్సిడెంట్ చేసిన యువకుడు మరెవరో కాదు. "దేశంలో కెల్లా అత్యధిక ధనవంతుడైన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ తనయుడుఆకాష్ అంబానీ. అతను ఆక్సిడెంట్ చేసిన మరుక్షణం వెనక రక్షణగా వస్తున్న మరో క...See More

  • Seen by 53
  • Padma Mvs దయచేసి ఈ ఫోటోను వీలైనత ఎక్కువమంది share చేయండి. మొత్తం దేశ మీడియా అంతా నోరు మూసుకుంది. దేశం మొత్తానికి తెలియజేయండి. నేరస్తునికి శిక్ష పడనియండి.
  • Padma Mvs ఉత్తినే like చేయడం కాదు. షేర్ చేయండి దయచేసి.....
  • Padma Mvs
శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యం జగద్వ్యాపినీం

వీణాపుస్తక ధారిణీం అభయదాం జాద్యామ్ధకారాపహాం

హస్తే స్ఫాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితం

వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ల్

సరస్వతీదేవి శుద్ధ సత్యస్వరుపురాలు కనుక శుక్ల వర్ణంతో ప్రకాశిస్తుంది. ఆ ఆద్యాశక్తి జగద్వ్యాపిని. వీణ, పుస్తక, అభయ, స్పతికామాల ధరించిన నాలుగు చేతుల విద్యామయి. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. ఆ పరమేశ్వరి పద్మాసన సంస్థిత. బుద్ది ప్రదాయిని. ఈ స్తోత్రంతో సరస్వతిదేవిని ప్రార్ధిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు పుస్తక రూపిణి సరస్వతి పుజని చేసి ఈ స్తోత్రాన్నిపఠించిన వారికి విద్యాభివృద్ది కలుగుతుంది.
ఈరోజు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు.

శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్, 22న తమిళనాడు లోని ఈరోడ్ లో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబం లో జన్మించాడు. పది సంవత్సరాల చిన్నవయసులోనే అతనికి అందరు క్లిష్టమని భావించే గణితం పట్ల ఆసక్తి పెరిగింది. 13 సంవత్సరాల వయసుకే అతను త్రికోణమితిలో పట్టు సాధించి తను స్వంతంగా సిద్దంతాలు రూపొందించాడు. ఇతని విద్యాభ్యాసం ఒక చోట కాకుండా తంజావూర్, కాంచీపురం, కుంబకోణం, మద్రాస్ ఇలా వివిధ ప్రదేశాలలో జరిగింది. ర...See More
తనకెంత మేలు చేసిన
మనమున కింపైన పనులు మసలిన దాసీ
వనితల కెన్నటి కైనను
చనవిచ్చి మెలంగరాదు జగతి కుమారీ!

పనివాళ్ళు మనకు ఎంత మేలు చేసినప్పటికీ, ఎంత మంచిగా ఉన్నప్పటికీ, వారికి అతి చనువు ఇచ్చి ఇంట్లో విషయాలు, వారికి చెప్పరాదు

చెప్పెడి బుద్ధుల లోపల
దప్పకు మొకటిన సర్వ ధర్మములందున్
మెప్పొంది ఇహ పరంబుల
తప్పింతయు లేక మెలగ దగును కుమారీ!

పెద్దవారు చెప్పిన ధర్మ బద్ధమైన సూక్తులు, నీతులు విని, మనసున నిలుపుకొని, వాటిని అన్ని వేళలా పాటించి ఏ పొరపాట్లు, తప్పులు చేయకుండా వ్యవహరించి పుట్టినింటికి, మెట్టినింటికి మంచి పేరు
తేవలయును .

నోరెత్తి మాటలాడకు,
మారాడకుకోప్పడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగకు
మీరకుమీ యత్తపనుల మెలగు కుమారీ!

అత్తవారింట్లో ఒక కోడలు మెలగ వలసిన పద్ధతులు చెప్తున్నారు కవి ఈ పద్యంలో. అత్తవారింట్లో గట్టిగ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా, ఎదురు చెప్పకూడదు. ఎవరైనా కోపగించుకొన్నా మనం చేసే మర్యాదలలో తక్కువ చేయకూడదు. అలాగే అత్తగారు చెప్పిన మాట దాటకూడదు. ఈ విధంగా అత్తవారింట్లో మసలుకోవాలి.
కర్కొటకస్య నాగస్య దమయంత్యా: నలస్య చ,
రుథుపర్ణస్య రాజర్శే: కీర్తనం కలినాశనం...

కలి సంబంధ బాధలు తొలగించే శక్తీ నల చరిత్రకు ఉంది. నలచక్రవర్తి కలిప్రభావం చేత నానా ఇక్కట్లు పడ్డాడు. కానీ, తన యోక్క ధర్మ ప్రవర్తనచే ఆ బాధలను అవలీలగా అతిక్రమించాడు. దమయంతి, కర్కోటక సర్పం, రాజర్షి రుథుపర్ణుదు మొదలగు మహాత్ర్ముల సహకారంతో కలి పెట్టిన ఇక్కట్లను సమూలంగా తొలగించుకున్నాడు.
కనుక కర్కోటక, దమయంతి, నల, రుతుపర్ణ -- నామాలతో ఉన్న ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకొంటే కలిబాధలు, శని బాధలు, గ్రహ బాధలు పోతాయని మహాభారతంలో చెప్పబడింది.
ఆచమనం - ఉపయోగము

అన్ని కార్యక్రమములు ఆచమనం తోనే మొదలవుతాయి.
"ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా" అనే మూడు నామాలకు ఒకొక్క పర్యాయం ఆచమనం చేస్తాము. అలా కేవలం ఆ మూడు నామాలనే చెపుతూ ఎందుకు నీటీని తీసుకోవాలి? మిగిలిన నామాలు కూడా భగవంతునివే కదా( ఓం రామాయ స్వాహా అంటూ అచమనము చేయము కదా?)?
...See More
ముఖపుస్తక మిత్రులకు, విజ్ఞులైన పెద్దలకు, చిన్నలకు, శ్రోతలకు... నా నమస్కారం మరియు శుభోదయం ..
Good morning friends.........................
ఈరోజు కుమారీ శతకం గురించి చెప్పుకుందాం... శ్రీ ప్రక్కి వెంకట నరసింహ కవి అనే ఆయన ఈ శతక కర్త. ఈ శతకములో ఆడపిల్లలు నేర్వవలసిన పద్ధతుల గురించి, పుట్టినింట, మెట్టినింట వారు నడుచుకోవలసిన పద్ధతుల గురించి చెబుతారు కవి. పూర్వకాలంలో ఆడపిల్లలు గట్టిగ నవ్వకూడదు అని, నేలపై శబ్దం అయ్యేలా నడవకూడదు అని కొన్ని కట్టుబాట్లు ఉండేవి. అవి అందరు పాటించేవారు కూడా. ఆడపిల్లలకు బడికి వెళ్లి చదువుకునే కన్నా, ఇంట్లోనే ఉండి, రామాయణం, భారతం, మొదలైన ధర్మ గ్రంధాలు, సంప్రదాయాలు, పెద్ద బాలశిక్ష వంటివి చదువుకుని ఏదో కొంత మాత్రం వ్రాయడం వస్తే సరిపోయేది. ఈ సుమతి శతక పద్యాలు ఆడపిల్లలకు చక్కని మార్గదర్శి గా ఉండేవి.

పెనిమిటి వలదని చెప్పిన
పని ఎన్నడు చేయరాదు బావలకెదుటన్
కనపడగ రాదు కోపము
మనమున నిడుకోనక ఎపుడు మసలు కుమారీ!

ఎంత చక్కని పద్యం? భర్త వద్దు అన్న పని చేయకూడదు. బావగార్ల ఎదుట పడరాదు, కోపం మనసులో ఉంచుకోకూడదు. అత్తవారింటఈవిధంగా ఉండవలెను అని భావము.

అసలు బావగార్లు, మామగారు ఎదుట వాళ్ళ మొహం లోకి చూసి మాట్లాడడం, వాళ్ళ ఎదురుగ కుర్చుని ఉండడం ఇప్పటికి తప్పే కొన్ని కుటుంబాలాలో. అది గౌరవం కాదు. కోపం మనసులో ఉంచుకోరాదు అంటే, అసలుకోపం వచ్చే ఏ విషయాన్ని మనసుకు పట్టించుకోకూడదు అని భావము. అత్తవారింట్లో కోపం తెచ్చుకుంటే, ఆడవారికే నష్టం. మానసికమైన బాధ. ఇటువంటి వన్నీ ఆరోజుల్లోనే చక్కగా చెప్పారు చూసారా...

మరదండ్రు అత్త వదినెలు
మరదులు బావలు కొమాళ్ళు పెద్దలు రా
ఉరవడి పీటలు మంచము
లరుగులు దిగుచుండవలయు నమ్ము కుమారీ!

ఇది మరియొక చక్కని పద్యం. మనం పీటలు, మంచము, అరుగులు ఇటువంటి ఉన్నత ఆసనములపై కూర్చున్నపుడు ఎపుడైనా, ఆడపడుచులు కానీ, అత్తగారు కానీ, మరుదులు, బావగార్లు కానీ, కుమారులు కాని, ఇంకెవరైనా ఇతర పెద్దలు కాని వచ్చినపుడు చప్పున 'కిందకు దిగవలెను అని భావము. అలాగే కింద కూర్చున్నపుడు కూడా లేచి నుంచోవడం ఇప్పటికి కొన్ని కుటుంబాలలో పాటిస్తున్న సంప్రదాయం. మనం పైన కుర్చుని వారికీ కూడా సీట్ ఆఫర్ చేస్తే ఏముతుంది అని ఈకాలం వాళ్ళు అనుకోవచ్చు. కాని అది సంప్రదాయం కాదు.

ఉరవడి= చప్పున.

ఇరుగు పొరుగిండ్ల కైనను
వరుడో కాక అత్తగారో, వదినాయో, మామో,
మరదియో సెలవీకుండగా
తరుణి స్వతంత్రించి పోవ దగదు కుమారీ!

ఇంట్లో కోడలు ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళాలి అనుకుంటే ఉమ్మడి కుటుంబములో , భర్త కానీ, అత్తగారు కానీ, ఆడపడచులు కానీ, మామగారు కానీ, మరదులు, బావగార్లు కానీ అనుమతించిన తరువాతే వెళ్ళవలెను. వారి అనుమతి లేకుండగా స్వతంత్రించి పోరాదు అని భావము.

>>> ఈ పద్యాలూ చదివితే ఈతరం ఆడపిల్లలు నామీద యుద్ధానికి వస్తారు. 21వ శతాబ్దములో కూడా ఆడవారి స్వేచ్చను హరించే ఇటువంటి విషయాలు చెప్తున్నారు అని. కానీ ఒక్క విషయం అందరు ఆలోచించండి. అత్తవారింట్లో వారి కనుసన్నలలో మెలిగి, వారు చెప్పినట్లు నడుచుకుంటే మనకు మెంటల్ స్ట్రెస్ ఉండదు. అంటే మన చదువు తెలివితేటలు నిరుపయోగమేనా అంటారా? ఎప్పటికి చదువు నిరుపయోగం కాదు. మన చదువును, తెలివితేటలను మన ఇంటి ఉన్నతికి, పిల్లల పెంపకానికి ఉపయోగించాలి పాజిటివ్ గా. ఇది నా సొంత అభిప్రాయం.
Duties of a Householder - Swami Vivekananda

http://www.slideshare.net/rajshalom/duties-of-a-householder-swami-vivekananda

"If a man with an ideal makes a thousand mistakes, I am sure that the man without an ideal makes fifty thousand. Therefore, it is better to have an ideal."
- Swami Vivekananda
భక్త రామదాసు కీర్తన
రాగం: ఆనందభైరవి
తాళం: ఆది

పల్లవి:...See More
ఆడవారూ గుండె భద్రం

భారతీయ స్త్రీలు ఇటీవల ఎక్కువ గుండె జబ్బులకు గురవుతున్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ఈ జబ్బులకు గురయ్యేవారి సంఖ్య 10 నుంచి 15 శాతంగా ఉంటే ఇప్పుడది 30 శాతానికి పెరిగింది.

ఇందుకు మారుతున్న మహిళల జీవన విధానమే ప్రధాన కారణమని నిపుణులు అంచనా - ఉద్యోగినులలో నానాటికి పెరుగుతున్న మానసిక శారీరక ఒత్తిడిలు గర్బనిరోధక మాత్రల వినియోగం వంటివి వారిలో గుండెజబ్బుల తీవ్రతను పెంచుతున్నాయి....See More
మంగళసూత్రం -నల్లపూసలు -ప్రాముఖ్యత ఏమిటి?

The Importance of Indian Traditions: Mangalsutras Nallapusalu are significant in Indian marriages ties around the brides neck during the marriage.

హైందవ వివాహంలొ ప్రధానమైన ఘట్టం మంగలసుత్రధారణ, వివాహితుల మెడలో మంగళసూత్రం తప్పని సరిగా ఉంటుంది .దీనికి తోడు నల్లపూసలు కూడా ఉంటాయి. ఇవి దుష్టశక్తుల కన్ను పడకుండా పెళ్ళిరోజున వధువుకు అదృష్టం చేకుర్చుతాయని మన పూర్వికులు చెబుతారు. నల్ల పూసలను వధువు మెడలో కట్టడం వల్ల ఆమెకు, ఆమె భర్తకు, వారి బాంధ...See More
గృహస్తు ధర్మాలను పాటిస్తే చాలు, సత్ఫలితాలన్నీ వాటంతట అవే చేకూరుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. భర్తకు అనుకులవతి అయిన భార్య దొరకడం ఒక మహా భాగ్యం. గృహస్తు విజయం అతని భార్యపైనే ఆధారపడి ఉంటుంది. మంచి భార్య ఉన్నవాడు ఎంతటి ఆపదనైనా సులభంగా దాటగలడు. మహాభారతం ప్రకారం ధర్మపత్ని-- ధర్మార్ధ కామ సాధనకు ఉపకరణం, గృహనీతి విద్యకు నిలయం, సత్ప్రవర్తన నేర్పే గురువు, వంశ అభివృద్ధికి మూలం, సద్గతికి ఊతం--ఇవన్ని పురుషులు గ్రహించాలి.

గృహస్తు- గృహిణి సహాయంతోనే అతిథులను సంతోశాపెత్తగాలుగుతున్నాడు. ఆశ్రమ ధర్మాలేన్ని ఉన్నా, గృహస్త ఆశ్రమం తో ఏదీ సమానం కాదు. భార్యతో పరితృప్తి చందే గృహస్తు అశ్వమేధ ఫలాని పొందగలడు. ఏ ఇతర ఆశ్రమమూ కూడా, గృహస్తాశ్రమం లో పదహారో వంతు కుడా కాదు.

మంచి భార్య వల్ల భర్తకు ధర్మార్ధ సుఖాలు కలుగుతాయి. అధర్మంగా ప్రవర్తించే భార్యలను అసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లతో సనాతన సంస్కృతీ ఈసడించింది. అటువంటి వారి వాళ్ళ వంశ నాశనం సంభవిస్తుంది.

భర్త అభిప్రాయాన్ని అనుసరించేది, సుగుణవతి, సంతానవతి అయిన భార్యను అవమానించే భర్తకు సద్గతులు ఉండవు అని శాస్త్ర వచనం. ధర్మపత్ని యెడల ప్రేమ, గౌరవాన్ని చూపటం భర్త యొక్క ప్రథమ కర్తవ్యమ్.

ఆధునికులు సైతం ఆచరించవలసిన సనాతన ధర్మం ఇది.
స్నాన విధి : :

మనము రోజు స్నానం చేస్తాము దానికి మళ్లీ ఇక్కడ వ్రాయాల అని అనుకోవద్దు. అందరికి తెలిసినవే నేను టపా(post) చేస్తూ ఉండొచ్చు. . కొద్ది మంది తెలియని వారి కోసం(నా లాంటి వారికి) టపా చేస్తుంటాను.

సంధ్యా వందనం లాంటి ఏ నిత్య క్రతువు చేయాలన్నా ముందుగా స్నానం చేయాలి.

స్నానం అంటే కేవలము నీటితో చేయటము మాత్రమే కాదు.
స్నానం వివిధ రకాలుగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అందులో ముఖ్యమైనవి " నిత్య స్నానం, భస్మ స్నానం, గోధూళి స్నానం, మంత్ర స్నానం మొ."

మనము రోజు నీటితో చేసేది నిత్య స్నానం.

విభూధి(భస్మం) భగవత్ ప్రసాదం గా భావించి ధరించటం భస్మ స్నానం.

ఆవు(గోవు) నడుస్తున్నప్పుడు పైకిలేచే మట్టి మన మీద పడినా ఆదీ స్నానమే. దాన్నే గోధూళి స్నానం అంటారు. ఇలా గోధూళి స్నానం చాలా గొప్పది అని చెప్తారు.

మంత్రమును చదువుతూ అంగములను శ్ర్పుసించటం / నీటిని చల్లుకోవటం మంత్ర స్నానం.
ఇలా ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి,

శాస్త్రం అన్నిటికి సమాన పీట వేయలేదు, కానీ పవిత్రం/ శుద్ధి అయినట్లే చెప్పబడింది.

నిత్య స్నానమునకు ముందు గంగా మాతను ఈ క్రింది శ్లోకాలతో ప్రార్ధించాలి .

శ్లో.. త్వమ్ రాజా సర్వతీర్ధాని త్వమేవ జగతహ్ పితా
యాచతో దేహి మే తీర్ధం సర్వపాపై: ప్రముచ్యతే.

శ్లో. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి,
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్చతి.

శ్లో.
నందినీి(1) నళినీ(2) సీతా(3) మాలినీ(4) చ మహాపగా(5),
విష్ణు పాదాబ్జ సంభూతా(6) గంగా(7) త్రిపధగామిని(8).
భాగీరథీ(9) భొగవతి(10) జాహ్నవీ(11) త్రిదశేశ్వరి(12)
ద్వాదశైతాని(12) నామాని యత్ర యత్ర జలాశయే,
స్నానకాలే పఠెన్నిత్యం మహాపాతక నాశనమ్.

(ఇది మొత్తం చదవలేని వారు కనీసం పైన చెప్పబడిన 12 పేర్లు అయినా చదవాలి).

తరువాత అచమనము చేసి, నీటితో నుదిటిన త్రిపుండ్రాలు ధరించి, శిఖ ముడి వేసుకొని, శరీరము తడుపుకొని, దేశ, కాల సంకీర్తనం(సంకల్పం) చెప్పి " మమ ఇహ జన్మని జన్మాంతారేషు, మనోవాక్కాయ కర్మభి: జ్ఞానతొ-అజ్ఞానత: కాయిక వాచక మానసిక సాంసర్గిక సకల పాపక్షయార్ధం ప్రాతః / మధ్యాహ్నిక / సాయం స్నానమహం కరిష్యె. అని నీటిని వదిలి స్నానము చేయవలెను
ఇప్పుడు కెశవునకు, సూర్యుడికీ, గంగకు ఒకొక్క మారు అర్ఘ్యమ్ ఇవ్వాలి.. ( అర్ఘ్యమ్ మగ వారు మాత్రమే ఇవ్వాలి). (ఈ అర్ఘ్యనికి మంత్రాలు ఉంటాయి)

ఆడవారు కేవలము పైన చెప్పిన 12 గంగా దేవి నామాలు చదివి నెత్తిన కొన్ని నీరు చల్లుకొని స్నానం చేయాలి.

  • You and Rekha Avadhani like this.
  • Padma Mvs చాల బాగా చెప్పారండి...తెలియని విషయాలు చెప్పారు. ముఖ్యంగా గంగాదేవి నామాలు చాల మందికి తెలియదు.
  • Padma Mvs
Padma Mvs changed the name of the group "ఇష్టాగోష్టి" to "ఇష్టాగోష్టి."
Padma Mvs changed the name of the group "ishtaagoshti" to "ఇష్టాగోష్టి."
Padma Mvs changed the name of the group "ishtagoshti" to "ishtaagoshti."
ఈరోజు వార్త.

తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేయడానికి నెయ్యి తక్కువ ఐనదట. శ్రీవారి లడ్డు ప్రసాదమునకు వినియోగించే నెయ్యి మీరట్ నుంచి రావాలట. మీరట్ తిరుపతికి చాల దూరం అయ్యిందట. అందుకని నెయ్యి సరఫరాలో ఆలస్యం ఔతున్నది కాబట్టి ఇక రోజుకి 70వెల లడ్డులు మాత్రమే తయారు చేయాలనీ తితిదే నిర్ణయించుకున్నది.
శుభోదయం మిత్రులారా....

ఈరోజు మరో రెండు కృష్ణ శతక పద్యాలు చూద్దాం...

క్రూరాత్ముడజామీలుడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏరీతి నేలుకొంటివి
ఏరి నీ సాటి వేల్పు లెందును కృష్ణా!

అజామీళుడు బ్రాహ్మణ కుటుంబం లో పుట్టినప్పటికీ, వైదిక కర్మల యందు శ్రద్ధ లేక, చెడు సావాసములు పట్టి మద్య మాంసములకు అలవాటు పడతాడు. తన కుమారునకు నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. తన అవసాన కాలంలో ఉద్దేశ్య పూర్వకంగా భగవంతుడిని తలవక పోయినా, తన కొడుకును నారాయణ అని పిలుస్తాడు. కారణం ఏదైనప్పటికీ, తన నామం స్మరించినందువల్ల విష్ణుమూర్తి అజామీలుడికి మోక్షం ఇస్తాడు.

అంతటి దురాత్ముడైన అజామీలునకే మోక్షం ఇచ్చిన ఓ కృష్ణ, నీకు సాటి వచ్చే దేవతలు ఎవరైనా ఉన్నారా అని భావము.

ఆత్మనందనుడు = కొడుకు
వేల్పులు= దేవతలు

చిలుకనొక రమణి ముద్దుల
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ నిను తలచు జనుల కరుదా కృష్ణా!

ఒక వనిత తన పెంపుడు చిలుకకు శ్రీరామ అని పేరు పెట్టి దానిని అస్తమాను శ్రీరామ అనే పేరుతో పిలువగనే ఆమెకు మోక్షము నిచ్చితివే, అటువంటి నిన్ను స్మరించు మానవులకు తక్కువా కృష్ణా అని భావము.

మిత్రులారా... ఒక విన్నపం.
ప్రతిరోజూ ఈ పద్యాలు పోస్ట్ చేయడం మీకు నచ్చనట్లయితే నాకు తెలియచేయండి. ఆధ్యాత్మికమైన విషయాలు, , సంస్కృతీ సంప్రదాయాల గురించి చాల మంది మిత్రులు పోస్ట్ చేస్తున్నారు. ఈరోజుల్లో చాల మందికి పద్యాల గురించి తెలియడం లేదు అనే భావనతో రోజుకి రెండు పద్యాలు పోస్ట్ చేస్తున్న. నచ్చక పొతే దయచేసి తెలియ చేయగలరు.
మిత్రులారా... మన గ్రూప్ పేరును ముచ్చట్లు (బ్రాహ్మణులకు ప్రత్యేకం) (న్యూ) ను ఇష్టాగోష్టి అని మార్చాము. గమనించగలరు.
Padma Mvs changed the name of the group "ముచ్చట్లు (బ్రాహ్మణులకు ప్రత్యేకం)(new)" to "ishtagoshti."
సూర్య భగవాన్ ద్వాదశ నామావళిః
( ప్రతి నిత్యం పాటించిన నేత్ర, చర్మ, హృదయ బాధలు తొలగును.. ఆరోగ్యము చేకూరును)

ఓం మిత్రాయ నమః
ఓం రవయె నమః
ఓం సూర్యాయ నమః
ఓం ఖగయే నమః
ఓం భానవే నమః
ఓం పుష్నే నమః
ఓం హిరణ్య గర్భాయ నమః
ఓం మారీచాయే నమః
ఓం ఆదిత్యయె నమః
ఓం సావిత్రే నమః
ఓం ఆర్కాయ నమః
ఓం భాస్కరాయ నమః

ఛాయా - సంధ్యా సమేత శ్రీ సూర్య దేవాయ నమః.
ముఖపుస్తక మిత్రులకు, విజ్ఞులైన పెద్దలకు, చిన్నలకు, శ్రోతలకు... నా నమస్కారం మరియు శుభోదయం ..
Good morning friends.........................lllistening to Devotional Songs.
65 పేజీలు, 13 షెడ్యూళ్లతో తెలంగాణ బిల్లు!

1వ షెడ్యూల్లో రాజ్యసభ సభ్యుల వివరాలు
2వ షెడ్యూల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల వివరాలు
3వ షెడ్యూల్లో శాసనమండలి స్థానాల వివరాలు...See More
"శారదమణి దేవి" గారికి జన్మదిన శుభాకాంక్షలు (జ.డిసెంబరు 18 ,1853 మ.జూలై 20 ,1920).

శారదా దేవి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి.

శారదాదేవి (డిసెంబరు 18 , 1853 - జూలై 20 , 1920), జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు శారదాదేవి ని శారదామాయి/శారదమాత/శ్రీ మా/హోలీ మదర్ అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందిం...See More
శుభోదయం మిత్రులారా...

ఈరోజు మరో రెండు కృష్ణ శతక పద్యాలు చూద్దాం.

వేదంబులు కననేరని...See More
శుభ సాయంత్రం మిత్రులారా..............
( Just for Fun)
మహాభారతం యొక్క గొప్పతనం.........

మహాభారతం భారతీయులకు ఎందుకు ఆదర్శగ్రంథంగా, గొప్ప గ్రంథంగా వెలుగొందుతోంది అని అనడానికి నన్నయ్య చెప్పిన ఈ పద్యం చక్కటి సమాధానం. వ్యాకరణ శాస్త్రం, మంత్రశాస్త్రం, రాజనీతి, వ్యవహార ధర్మాలు ఆపద్ధర్మ, మోక్ష ధర్మాలు, తత్వ విషయాలు, పురాణ ఆధార కథలు ఇలా ఎన్నెన్నో ఈ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుంచి మహాభారతం భారతావనిలో భాసిల్లుతోంది. కావ్యాలు, నాటకాలులాంటి వాటికే కాక లలిత కళలకు కూడా మహాభారతం కల్పవృక్షంలాంటిది. కాళిదాసు మహకవి రచించ...See More
To the Admin....

సకల అష్ట అర్ఘ్యాలతో సుఖ శాంతులతో నూరేళ్ళు బంధు మిత్రులతో......... జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలని ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళల ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని శ్రీధర్ పుల్లూరి.
సూర్యకాంతం గారికి శ్రద్ధాంజలి ..

"సూర్యకాంతం", ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం.

"బహుముఖ నటనా ప్రవీణా రంగస్థల శిరోమణి, సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి" అయిన ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త "సూర్యకాంతం" గారు (మరణం: 17 డిసెంబర్, 1996) మన మధ్యన భౌత...See More
అనివార్య కారణాల వాళ్ళ రేపటి పోస్ట్ కూడా ఇవాళే ఉంచుతున్నా...

శ్రీ కృష్ణ శతకం లోని మరో రెండు పద్యాలు:

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నంద కుమారా!
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!

హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు లంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా!

ఈ పై రెండు పద్యాల లోను అంతగా అర్ధం కాని పదాలు ఏమి లేవు కాబట్టి భావం ఇవ్వడంలేదు.
నగధర అంటే నగము అంటే పర్వతము. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను కాపాడాడు కాబట్టి నగమును ధరించినవాడు నగధరుడు అని కృష్ణుడికి పేరు.

>> హరియించును పాతకంబు లంబుజనాభా అనే వాక్యములో పాతకములు+అమ్బుజనాభ అని సంధి విడదీయాలి. పాతకములు అంటే పాపములు. అంబుజము అంటే పద్మము. పద్మమును నాభియందు కలవాడు కాబట్టి విష్ణువుకు అమ్బుజనాభుడు అని పేరు. హరియించుట అంటే తొలగించుట.

ఇంత చాదస్తంగా వివరంగా చెప్తున్నాను అనుకోకండి. ఇంగ్లీష్ మీడియం లో చదివిన పిల్లలకు మాములు తెలుగు పదాలే తెలియడంలేదు కదా. వారి కోసం ఇంత వివరణ.

మళ్లీ సోమవారం కలుద్దాం.
తెలుగు సాహిత్యం లో శతకాలది ఒక ప్రత్యెక స్థానం. శతకాలలో చాల రకాలు ఉన్నాయి. దాశరధి శతకం, శ్రీ లక్ష్మి నారసింహ శతకం, ఇటువంటివి భగవంతుని కీర్తించేవి ఐతే, సమాజంలో ఉన్న మూధనమ్మకాలను నిరసించి, మంచి మార్గం చూపించే వేమన శతకం లాంటివి కొన్ని. అలాగే చిన్నతనం నుంచి పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించే కుమారి శతకం, సుమతి శతకం వంటివి మరికొన్ని.

పూర్వకాలంలో ఆడపిల్లలను ఎంతవరకు చదువుకోన్నావు అని అడిగితె బాలశిక్ష, కుమారి శతకం, దాశరథి శతకం-- అని ఇలా కొన్ని పుస్తకాల పేర్లు చెప్పేవారట. ఇప్పటిలా అప్పుడు క్లాసుల లెక్క ఉండేది కాదు.

కానీ ఈరోజుల్లో మనం శతకాల మాటే మర్చిపోతున్నాం. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో కూడా మన పూర్వ సాహిత్యం గురించి పెద్దగ పట్టింపు ఉండటం లేదు. పిల్లలకు తేలికగా నోరు తిరిగి సులభంగా నేర్చుకునే కొన్ని శతక పద్యాలు మనం ఇక్కడ నేర్చుకుందాం.

ఐతే ఇవన్ని పెద్ద బాలశిక్షలోనో, గూగుల్ లోనో దొరుకుతాయి కదా అని కొందరు సందేహ పడవచ్చు. కానీ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి అని మనకి మనసులో అనిపించినా, ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప దాని మిద దృష్టి పెట్టలేని స్థితి లో మనం ఈరోజు ఉన్నాము. వినడానికి కొంత నిష్టూరంగా ఉన్నా, ఇది నిజం. ఈకాలం అటువంటిది. ఎవరిని తప్పు పట్టనవసరం లేదు. పిల్లలు కూడా పుస్తకంలో చదివేకన్న online లో ఐతే ఉత్సాహంగా నేర్చుకుంటారు కదా..

అందుకే ఈరోజు నుంచి పిల్లలకి నేర్పించేందుకు కొన్ని సులభమైన శతక పద్యాలు రోజుకి రెండు తెలుసుకుందాం.

శ్రీకృష్ణ శతకం లోనివి ఈ క్రింది పద్యాలు....

శ్రీ రుక్మిణీశ ! కేశవ!
నారద సంగీతలోల! నగధర శౌరీ!
ద్వారక నిలయ! జనార్దన!
కారుణ్యము తోడ మమ్ము కావుము కృష్ణా!

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు, దైవము,
నీవే నా పతియు, గతియు, నిజముగ కృష్ణా!

చాల సులభంగా ఉన్నాయి కదా... మరి ఆలస్యం ఎందుకు? మనం నేర్చుకుని, పిల్లలకు కూడా పరిచయం చేద్దాం...
ముఖపుస్తక మిత్రులకు, విజ్ఞులైన పెద్దలకు, చిన్నలకు, శ్రోతలకు... నా నమస్కారం మరియు శుభోదయం ......
"ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష చేపట్టి అమరజీవి అయిన "శ్రీ పొట్టి శ్రీరాములు"గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి".
( జననం: మార్చి 16 1901 & మరణం: డిసెంబరు 15 1952 )

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
...See More
ఈరోజ మార్గశిర శుద్ధ ఏకాదశి, "గీతా జయంతి". అనగా

ఈ 'మార్గశిర శుద్ధ ఏకాదశి' నాడు శ్రీ కృష్ణుడు ఆర్జునుడినకి "భగవద్గీత"ను భోధించిన పుణ్యతిథి.
తెలుగు సినీ కథానాయిక నటీమణి లక్ష్మి ఎర్రగుడిపాటి గారికి జన్మదిన శుభాకాంక్షలు (జ. 1952, డిసెంబరు 13న మద్రాసులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది).
Facebook సాంప్రదాయాలు......
On this day Dec 12 1911 – Delhi replaces Calcutta as the capital of India.
తెలుగు సినీ కథానాయిక షావుకారు జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు (జ. 1931 డిసెంబరు 12).
Last of the CENTURY............
MY WISHES TO ALL MY FRIENDS AND GROUP MEMBERS ON THIS SPECIAL DAY.....
Padma Mvs changed the group privacy setting from Open to Closed.
Padma Mvs changed the name of the group "ముచ్చట్లు (బ్రాహ్మణులకు ప్రత్యేకం)" to "ముచ్చట్లు (బ్రాహ్మణులకు ప్రత్యేకం)(new)."
Padma Mvs changed the group privacy setting from Closed to Open.
మిత్రులారా... మన రాష్ట్రం లోనే ఉన్న విహార యాత్రా స్థలాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 'అరకులోయ' గురించి తెలుసుకుందాం.

అరకు లోయ విశాఖకు దగ్గరలో సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఒక hillstation . ఇక్కడికి రైలు, రోడ్ మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైలు అయితే, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కిరండొల్ పాసెంజర్ ఉంది. అరకు చేరడానికి ఇది ఒక్కటే రైల్. అయితే అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ రైలు ప్రయాణం మాత్రం మిస్ కావద్దు. ఎందుకంటే కొండల మిద వేసిన రైల్వే ట్రాక్ కారణంగా ఈ రైలు సుమారు 58 సొరంగాలు, 84 వంతెనల మిద సాగుతుంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. జీవితంలో మర్చిపోలేము. మళ్లీ రాత్రికి ఇదే రైలు తిరుగు ప్రయాణం ఔతున్ది.

ఇక రోడ్ ద్వార వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విశాఖ నుంచి, విజయనగరం నుంచి ఎన్నో బస్సు సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి ఐతే 3 గంటలు, విజయనగరం నుంచి అయితే సుమారు గంటన్నరలో అరకు చేరుకోవచ్చు. విజయనగరం నుంచి వెళ్ళే వాళ్ళు దారిలో తాటిపూడి జలాశయం కూడా చూడవచ్చు.

రోడ్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉదయం సుమారు 9 గంటలకు tyada రోడ్ చేరుకుంటే, రోడ్ ప్రక్కనుంచి టన్నెల్ లోంచి వెళ్ళే కిరండొల్ express ను చూడవచ్చు. తరువాత అనంతగిరి వెళ్ళే దారిలో కాఫీ ప్లాంటేషన్స్ రోడ్ కు ఇరువైపులా మనం చూడవచ్చు. స్థానిక గిరిజనులు పండించే అనంతగిరి కాఫీ అంతర్జాతీయం గ ప్రసిద్ధి పొందినది. ఇక్కడి 'గాలికొండ వ్యూపాయింట్ ' దగ్గర స్థానిక గిరిజనులు కాఫీ గింజలు, కాఫీ పొడి, మిరియాలు, మసాలా దినుసులు అమ్ముతారు. పచ్చి మిరియాలు కూడా చూడవచ్చు. ఒక్క పచ్చి మిరియం గింజ నోట్లో వేసుకొని కొరికి నమలండి. ఆ చలి వాతావరణం లో పచ్చి మిరియం ఘాటు అనుభవించండి. కాఫీ ప్రియులు ఇక్కడి కాఫీ పొడి కొనుక్కోండి. ఆ కాఫీ రుచి చాల బాగుంటుంది.

ఇక అరకు లో పద్మాపురం గార్డెన్స్, చాపరాయి జలపాతం, ట్రైబల్ museum , బొర్రా గుహలు చూడదగిన ప్రదేశాలు. పద్మాపురం గార్డెన్స్ లో వివిధ రకాల, వివిధ సైజుల గులాబీలు చూడవచ్చు. అలాగే ఎన్నో రకాల పుష్ప జాతులు చూడవచ్చు. ఇక్కడ bamboo tree houses ఉన్నాయ్. రాత్రి బస చేసేవాళ్ళు అద్దెకు తీసుకోవచు.

చాపరాయి దగ్గర కొండ ఎత్తుగా ఉండకుండా చాప లాగా సమతలంగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

APTDC వాళ్ళు ఇక్కడి గిరిజన జాతులకు సంబంధించిన చరిత్ర, వారి ఆచార వ్యవహారాలూ తెలియ చేసేందుకు వీలుగా ఫైబరు తో చేసిన బొమ్మలతో ఒక museum నెలకొల్పారు. ఇక్కడ షాపింగ్ కూడా చేయవచు.

ఇక అరకుకు కొద్ది దూరంలో ఉన్న బొర్రా గుహలు చూడడం ఒక మంచి అనుభవం. ఈ గుహలను విలియం కింగ్ అనే ఆంగ్లేయుడు 1807 లో కనిపెట్టాడు. ఇవి ఒక మిలియన్ సంవత్సరాల క్రితం భూమిలో ఉండే లోహాలు, రసాయనాల వల్ల సహజంగా రూపు దిద్దుకున్న గుహలు. వీటిలో APTDC లైటింగ్ ఏర్పాటు చేసి ఇంకా అందంగా తయారు చేసారు.

ఇక్కడ బస చేయడానికి APTDC హరిత హోటల్స్ నడుపుతోంది. బయట మన అదృష్టం కొద్ది ఒకే ఒక శాకాహార భోజన హోటల్ ఉంది. హరిత హోటల్స్ లో శాకాహార భోజనం దొరుకుతుంది.

అరకు దర్శించడానికి అనువైన కాలం వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి january మధ్య కాలం. ఇక్కడ ఈకాలం లో వలిసే పూవులు పూస్తాయి. లోయ అంతా ఈ పూవుల పచ్చ రంగుతో పసుపు పచ్చ తివాచి పరిచినట్లు ఉంటుంది. ఆ అందం తప్పనిసరిగా చూడవలసినదే.

ఈకాలం లో అరకు లోని landscapes మనలను కట్టిపడేస్తాయి. వానాకాలంలో అరకు రైలు లో వెళ్ళే సాహసం చేయకండి. కొండచరియలు విరిగి పడుతుంటాయి. ప్రమాదం కూడా.
నిన్ను తలవని క్షణం లేదు.
నన్ను నేను మరచిన నిన్ను నేను మరువలేదు.
నీవు నన్ను తలవక పోయిన నీమీద నాకు కోపంలేదు.
నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.
మరవడానికి మరణమే శరణ్యం అనుకుంటే, దానికి అంతటి ధైర్యంలేదు.
ఆనందాన్ని ఇచ్చేది అబద్దం...
కన్నీరు తెచ్చేది నిజం...
నువ్వు నాతోనే ఉన్నావన్న అబద్దాన్నే నమ్ముతున్నా..
నీ తోనే కలసివుంటాను అనే అబద్దం కన్నా....
నిన్ను తలవని క్షణం లేదు...See More
ఆంధ్ర కాష్మీరం....

మంచు పరదాల వెనుక దాగిఉన్న సూర్యోదయాలు, త్రోవ పక్కన పూలబాలల స్వాగతాలు... వెన్ను వణికించే చలి చలి రాత్రులు..... ఇవన్ని చూడాలి అనుకుంటే ఎక్కడో మన దేశ ఉత్తరాన ఉన్న హిమాలయాలకో, కాశ్మీర్ కో వెళ్ళాలి అనుకుంటున్నారా.... ఇంక అంత దూరం అవసరం లేదు... మన రాష్ట్రానికి కూడా ఒక కాశ్మీర్ ఉంది... ఎక్కడ అనుకుంటున్నారా....

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లో విశాఖకు పశ్చిమ దిశలో, తూర్పు కనుమలలో, దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది "లంబసింగి". ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఒక కుగ్రామం.

సముద్ర మట్టానికి సుమారు 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామంలో ఏడాది పొడవునా చాల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. నిండు వేసవిలో కూడా ఎండ 10 డిగ్రీలకు మించదు. మరి ఇంక శీతాకాలంలో ఐతే 4 డిగ్రీలకి పడిపోతుంది ఉష్ణోగ్రత. సితాకాలంలో ఉదయం 10 గంటల వరకు పొగమంచు కప్పి ఉంటుంది. దారి కూడా సరిగా కనబడదు.

ఈకాలంలో లంబసింగి లో ప్రకృతి చాల అందంగా ఉంటుంది. చాల రకాలైన పువ్వులు మనకు కనువిందు చేస్తాయి.

లంబసిన్గికి కొద్ది దూరంలో ఉన్న "తాజంగి" లో ఒక చెక్ డాం ఉన్నది. తజంగి గ్రామానికి దిని ద్వారానే తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ సరస్సు పక్కన చుట్టూతా కొండలతో ప్రకృతి ఎంతో మనోహరంగా ఉంటుంది.

ఈ క్రింది ఫోటోలు చూసి ఐన ఒప్పుకుంటారా, లంబసింగి ఆంధ్ర కాష్మీరం అని.....
తన పుట్టినరోజు కానుకగా రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యెక తెలంగాణా ప్రకటన చేసి తెలుగు వారి మనోవేదనకి కారణమైన సోనియా గాంధీకి 4 రాష్ట్రాల ప్రజలు మొత్తంగా ఇచ్చిన కానుక---- ఘోర పరాజయం...
మన సంస్కృతి-- సాంప్రదాయము
అక్టోబరు 22, 2008 భారతీయ స్పేస్ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజే మన దేశం చంద్రాయాన్ - 1 ప్రయోగం
విజయనామ సంవత్సర మార్గశిరమాసము
తిథి: శుక్ల-షష్టి (ఆదివారం)
( 7) 13:34 నుండి ( 8) 11:11 వరకు
నక్షత్రం: ధనిష్ట
( 7) 16:54 నుండి ( 8) 15:19 వరకు...See More
జీవుని పయనం శాశ్వతం

వ్యాసమహర్షి సంస్కృత భాగవత గ్రంధం షష్టమ స్కంధంలో జీవుని పయనం అద్భుతంగా వర్ణింపబడినది. శ్రీ శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు భాగవత కథలను వివరిస్తూ రాజా పూర్వము శూరసేన దేశంలో చిత్రకేతుడను రాజుకు పుత్రమరణం సంభవించినది. రాజు పుత్రశోకంలో ఉన్న సమయంలో అంగిరసుడు, నారదుడు వచ్చి రాజుకు జ్ఞానబోధ గావించి ధైర్యమును కలిగిస్తూ జీవుని పయనం గురించి వివరించారు. రాజా! ఎవని కొరకు నీ వింతగా దుఃఖించుచున్నావో ఆ పిల్లవాడు ఈ జన్మలో గాని, పూర్వజన్మలందు గాని మీ ఇద్దరికీ ఏమి సంబంధము? అలా...Continue Reading
శ్రీకృష్ణ లీలామృతం

దేవాదిదేవుడు, అఖిల లోకేశ్వరుడు భగవానుడూ అయిన శ్రీమన్నారాయణుడే వాసుదేవుడుగా కృష్ణావతారంతో భూమిమీద అవతరించాడని భాగవతం, భారతం తెలుపుతున్నాయి. ధర్మరాజు అయిన యుధిష్టిరుడు రాజసూయ యాగం చేసినప్పుడు అందులో పాల్గొనడం కోసం నారదుడు మహారాజులు ఎందరో విచ్చేశారు. వారితో పాటు శ్రీకృష్ణుడు కూడా సభా మండపాన్ని అలంకరించి ఉండడం చూసి భగవానుడైన శ్రీమన్నారాయణుడు భూమండలం మీద ఆ రూపంలో అవతరించాడు. అతడు పుండరీకాక్షుడై శ్రీహరిని మనసులో స్తుతించడం మొదలు పెడతాడు. అప్పుడు కురు కులవృద్ధుడు...Continue Reading
ఈరోజు ఒక మంచి పుస్తకం గురించి తెల్సుకుందాం. నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చిన పుస్తకం.. సత్యం శంకరమంచి గారు వ్రాసిన అమరావతి కథలు. ఇందులో దాదాపు 100 కథలు ఉన్నాయ్. అన్ని చాల సరళమైన భాషలో పిల్లలకు కూడా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటై.

బ్రాహ్మణ అగ్రహారం లో అప్పటివరకు కులాలు పట్టింపు ఉన్నా, అమాంతం వరద వచ్చేసరికి ఊరి జనం అందరు కుల భేదం లేకుండా ఊరి అవసరాలు ఎలా తీర్చారు అనేది 'వరద' కథ.

బాగా తిండి పుష్టి ఉన్న అప్పంభోట్లు ఊరిలో ఉన్న మామ్మగారికి మనవడు పుట్టినట్లు శుభవార్త మోసుకేల్తే, అంత వయసులోనూ, ఆవిడ అప్పంభోట్లు కి ఎలా వండి వడ్డించింది అనేది 'అప్పంభోట్లు' కథ. చాల సొగసుగా మునివేళ్ళతో రెండు మెతుకులు తీసుకోని నోట్లో వేసుకొని భోజనం ఐపోయింది అనుకునే ఈతరానికి సుష్టు గ భోజనం చేసే అప్పంభోట్లుని చుస్తే ఆశ్చర్యమే మరి.

కార్తీకమాసం వనభోజనాలకి వెళ్ళినపుడు అందరికి కొసరి కొసరి వడ్డించిన వంటవాడు ఆఖరున మిగిలిన కొద్ది పదార్థాల్ని విస్తర్లో వడ్డించుకుని తిని బ్రేవ్ మని త్రేన్చి, అందరు తృప్తి గ తింటే చాలు నా ఆకలి తీరినట్లే అనుకొన్న కథ ఒకటి. ఇందులో ఈకాలం పిల్లలకి తెలియని అచ్చ తెలుగు వంటల పేర్లు తెలుసుకోవచ్చు.

ఆస్తికుడు, నాస్తికుడు, వారి వారి ద్రుక్పథములు వివరించిన కథ మరొకటి. గుడిలో పూజారి ఇచ్చిన తీర్థం భగవత్ప్రసాదం అని ఆస్తికుడు అనుకుంటే, నోరు తడిపి దాహం తీర్చింది అని నాస్తికుడు అనుకుంటాడు. ఎవరి భావాలు వాళ్ళవి....

ఇవే కాక మరెన్నో కథలు, మనసులు స్ప్రుశించేవి, మనని ఆలోచింప చేసేవి, దాదాపు అన్ని కథలు ఆణిముత్యాలు.... ఎన్ని సార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలి అనిపించేవి..

ఇప్పటికే ఈపుస్తకం చదివిన వాళ్లకి ధన్యవాదములు. ఇంకా చదవని వారు తప్పక ఒకసారి చదవండి. వీలైతే పిల్లల చేత కూడా చదివించండి.. సిటీ బ్రతుకులు, ఇంగ్లీష్ చదువులు అలవాటైన పిల్లలు ఒకసారి తెలుగు గురించి, తెలుగులో ఉన్న మంచి సాహిత్యం గురించి తెలుసుకుంటారు.
తెలుగువిజ్ఞానంవినోదం
ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్న
గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు.
తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని
తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు....See More
మార్గశిర మాసము:

వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.
శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా!
ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!!
వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది.
అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు. ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక వశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను
ఈరోజు "అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం " సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సుభాషిని గారి పోస్ట్ చూసాక ఇది వ్రాస్తున్నా. మంచి విషయాలు చెప్పారు.

వికలాంగుల కోసం ప్రభుత్వం ఎన్నో పధకాలు ప్రవేశ పెడుతుంది. కానీ అవేవి ఆచరణ లోకి రావు.

ఈనాడు పెద్ద పెద్ద సిటీల్లో పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో,పాఠశాలల్లొ వికలాంగుల కోసం మెట్లు కాకుండా రాంప్ లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి వీలైన విధంగా టాయిలెట్స్, ఏర్పాటు చేస్తున్నారు. బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్ లలో కూడా వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే ఇవి కొన్ని నగరాలకే పరిమితం అవుతున్నాయి. అన్ని చోట్ల ఇవి ప్రారంభం ఐతే వారికీ సహాయంగా ఉంటుంది.

శుభ గారు అన్నట్లు మనం అందరం కూడా వీలు అయినప్పుడు వారికీ సహాయ పడితే బాగుంటుంది..
ప్రాతస్మరణ శ్లోకాలు కొన్ని మనం చెప్పుకున్నాం కదా... ఇవాళ మరికొన్ని తెలుసుకుందాం.

క్రింది రెండు శ్లోకాలు త్రిమూర్తుల గురించి, నవగ్రహాల గురించి, మన ఋషుల గురించి చెప్పినవి. వీటిని కూడా ఉదయాన్నే స్మరణ చేసుకోవడం మంచిది.

బ్రహ్మ మురారి త్రిపురాన్తకారి, భాను భూమిసుతో బుధశ్చ,
గురుశ్చ, శుక్ర, శని రాహుకేతవహ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.

సనత్కుమార సనక సనన్దనహ సనాతనౌ ప్యాసురి పింగలౌ చ,
సప్తస్వరా సప్త రసాతలాని కుర్వన్తు సర్వే మమ సుప్రభాతం.

మన నాగరికతలో మనం గిరులను, నదులను, సముద్రాలను కూడా పూజిస్తాం. మన దేశ ఔన్నత్యన్ని తెలిపే కొన్ని శ్లోకాలు. ఇవి అందరికి సులభంగా అర్ధం అవుతాయి. పిల్లలకు సులభం గ వివరించి అర్ధం చెప్పవచ్చు.

సప్తార్నవా సప్తకులాచలశ్చ, సప్తర్శ్యో ద్వీపవనాని సప్తః,
భూరాదికృత్వా, భువనాని సప్తః, కుర్వన్తు సర్వే మమ సుప్రభాతం.

మహేంద్రో మలయస్సహ్యో, దేవతాత్మా హిమాలయః
ధ్యేయో, రైవతకో విన్ధ్యో, గిరిశ్చారావలీ తథ

గంగేచ యమునైచైవ గోదావరీ సరస్వతీ,
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు

అయోధ్య మధుర మాయ, కాశీ కాంచీ అవంతికా,
పూరి ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికాహ.

రత్నాకర దౌత పదం. హిమాలయ కిరీటినీం
బ్రహ్మ రాజర్షి రాత్నాభ్యం వందే భారత మాతరం.ల్

మరి కొన్ని ప్రాతః స్మరణ శ్లోకాలు రేపు చెప్పుకుందాం...
అసలు దండనీతి ఎందుకు?
అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు! అసలు దండనీతి ఎందుకు? దండం లేకుండా ప్రజలని, కుటుంబాన్ని పాలించలేమా?
భీష్ముడు: సృష్టిని నాశనం చేసేది ఒకే ఒక్క ఆయుధం. విచ్చలవిడితనం. దండం లేకపోతె ప్రజలేకాదు కుటుంబసభ్యులు కూడా మాట వినరు.
సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ ఒక యజ్ఞం చేయాలనీ సంకల్పించి క్షుతుడు అనే ఋత్విక్కుని సృష్టించాడు. అతనితో! నువ్వు సృష్టి కోసం ఒక యజ్ఞం చేయించాలి నాతో, కనుక అన్ని ఏర్పాట్లు చెయ్యి అని పంపించాడు. ఆ ఋత్విక్కు వెళ్లి అక్కడ ఉన్నవారితో నువ్వు ఇటుకల...Continue Reading
All those who support reservations, one day or other going to suffer in the hands of half-knowledged doctors, engineers - - - inefficient bureaucrats, incompetent officers who have secured the post based on RESERVATIONS IN PROMOTIONS . . . . .
Brahmins seek welfare measures

SPECIAL CORRESPONDENT The Hindu, 02.12.2013

Brahmins should cast their votes to a political party which promises to establish a Brahmin Welfare Corporation in its 2014 election manifesto and to strive for the welfare of the community, All India Brahmana Seva Sangha Samakhya executive member Bandatmakur Sudarshana Sarma said on Sunday....See More
భారతదేశం ఒక వేదభూమి. ఎన్నో దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం లో నాగరికత గొప్పగా విలసిల్లింది. ఈ భూమి ఎంతో మంది మునులకు, ఋషులకు, అవతార మూర్తులకు ఆలవాలం. వీరందరూ ముందు తరాలు ఎంతో సంతోషంగా , ప్రశాంతంగా , సౌఖ్యంగా బ్రతకడానికి అవసరమైన ఒక గొప్ప సంస్కృతిని మనకు కానుకగా ఇచ్చారు. మన సంస్కృతీ లో చెట్లు, నదులు, సముద్రాలూ, జంతువులూ అన్నిటిని పూజించే సంప్రదాయం ఉంది. వాటి వాళ్ళ మనకు ఎంతో ఉపయోగం ఉంది కనక, వాటిని నాశనం చేయకుండా నిలిపి ఉంచేందుకు వాటిని పూజించడం అనే ఆచారం పెట్టారు.

అలాగే, మానవుడు నిద్ర లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు దైవస్మరణ చేసుకొనేందుకు వీలుగా ప్రతి సందర్భం లోను ఒక శ్లోకం వారు మనకు అలవాటు చేసారు. అందులో కొన్ని శ్లోకాలు చెప్తాను. పిల్లలకు పెద్ద పెద్ద స్తోత్రాలు నేర్పక పోయినా, ఇటువంటివి నేర్పి అందులోని ఔచిత్యం మనం వివరిస్తే, ఇంగ్లీష్ చదువులకు అంకితం అయిపోయిన ఈతరం పిల్లలకు మన భారత దేశ ఔన్నత్యం తెలియడానికి అవకాశం ఉంటుంది.

ఉదయం నిద్రలేవగానే, పక్క మిద కూర్చుని అరచేయి చూసుకుంటూ చదవవలసిన శ్లోకం:

కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతీ,
కరమూలేతు గౌరీ చ ప్రభాతే కరదర్శనం.ll

లేచిన తర్వాత భూమి మిద కాళ్ళు పెడుతూ భూదేవిని కాలితో స్పర్శిస్తున్నందుకు క్షమించమని కోరుతూ:

సముద్ర వసనే దేవి, పర్వత స్థనమండలే,
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ll

అసలు చదువుకునే పిల్లలు అందరు బ్రాహ్మి ముహూర్తం లో లేస్తే మంచిది. ఒకవేళ అలా లేవలేకపోయి, సూర్యోదయం వేళకు లేచిన కూడా, ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని "ఓం సవిత్రే నమః" అని 11 సార్లు స్మరణ చేస్తే చాల మంచిది.

ఇంకొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం.
ఎట్టకేలకు మహాకవి గురజాడ వారి స్టాంప్ ను ప్రభుత్వం విడుదల చేసింది. నిన్న మహాకవి వర్ధంతి సందర్భంగా విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియం లో గురజాడ సాహితీ సమాఖ్య అధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో గురజాడ తపాలా బిళ్ళను కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి ఆవిష్కరించారు. అదే విధంగా గురజాడ ముఖచిత్రం, ఆయన స్వగృహం చిత్రం లతో కూడిన పోస్ట్ కార్డు ను కూడా విడుదల చేసారు. గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ రచయిత శ్రీ మొదలి నాగభూషణ శర్మ కు ప్రదానం చేసారు.

గురజాడ 150 వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 21న తపాల బిళ్ళను విడుదల చేయాల్సి వుందని, ఆ సమయంలో విజయనగరం లో పరిస్థితులు అనుకూలంగా లేనందుకు వర్ధంతి రోజున విడుదల చేసామని postmaster general చెప్పారు.
hai ఫ్రెండ్స్, ఒక చిన్న confession .

మనం అందరం చిన్నతనంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేసి ఉంటాం. కొంత వయసు వాచక అప్పుడు ఎందుకు ఇలా చేసామా అని బాధ పడతాం. చేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాప పడతాం. అటువంటి సంఘటనలు మీ జీవితంలో ఉంటె వాటిని ఇక్కడ share చేసుకోండి. ఇది సరదాకే కానీ , ఎవరిని నొప్పించడానికి కాదు.

ముందు నేను చెప్తాను. చిన్నప్పటినించి మా అక్క చాల బుద్ధిగా ఉండేది. తనతో నన్ను పోల్చి నేను అల్లరి చేస్తున్న అని ఇంట్లో తిట్టేవాళ్ళు. నేను అల్లరి మానకుండా, దీనికి కారణం మా అక్క అల్లరి చేయకపోవడం అని డిసైడ్ అయి, మా అక్క చదువుకుంటుంటే తన దగ్గరే బ్లేడ్ తీసుకుని తన తొడ మిద గిసేసాను.బ్లేడ్ చాల పదునుగా ఉంది. పాపం ఎంత రక్తం పోయిందో. ఐన నన్ను ఏమి అనలేదు మా అక్క. ఈ విషయం గుర్తు వస్తే ఇప్పటికి చాల బాధగా ఉంటుంది.
నేను ఒక ఫ్రెండ్ తో కలిసి ఒక అమ్మ ( బాబాలకు ఫిమేల్ వెర్షన్) దగ్గరకు వెళ్ళాను. అక్కడ చాల మంది కుర్చుని ఉన్నారు. మేము కూడా కూర్చున్నాము. నేను వేరే ఒక పక్కకు కూర్చున్నా. అందరు ఆవిడకి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అన్ని కూడా ఆరోగ్యం, లేదా అనుకున్న పనులు జరగక పోవడం. లేదా అమ్మాయి పెళ్లి, అబ్బాయి ఉద్యోగం, తీరని అప్పులు... వీటికి సంబంధించిన సమస్యలు. ఆవిడ అందరికి బొట్టు పెట్టి, మీ సమస్య త్వరలో తీరుతుంది అని చెప్పి దక్షిణ అడుగుతున్నారు. అందరిని ఉపవాసాలు చేయమని చెప్తున్నారు. కానీ వేరే ప్రత్యెక పూజలు కానీ, మంత్రోపదేశం కానీ చేయట్లా. కానీ దక్షిణ భారీగానే పుచ్చుకుంటున్నారు. పక్కనే ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది. దానికి కావలసిన మెటీరియల్ కొంత మందిని అడుగుతున్నారు.

నేను మౌనంగా చూస్తూ కూర్చున్నా. నన్ను పిలిచి నీ సమస్య ఏమిటో చెప్పు అన్నారు. నాకు పెద్ద సమస్యలు ఏవి లేవండి. నేను నా ఫ్రెండ్ తో వచాను. అన్నాను. కాదు చెప్పు అని బలవంతం చేసారు. నాకు సమస్యలు లేవు అని రెండో సారి చెప్పగానే ఆవిడకి కోపం వచ్చింది. సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. నీ సమస్య నేను తీరుస్తాను. అన్నారు. నేను మళ్లీ అదే జవాబు చెప్పాను . ఐతే చూడు, నన్ను ధిక్కరించి మాట్లాడినందుకు నీకు త్వరలో అనేక కష్టాలు వస్తాయి, నువ్వే నా దగ్గరకు వస్తావు. అని అన్నారు ( శపించారు).

అమ్మలు, స్వామిజి లు ఇలా కూడా ఉంటారా.

సమస్యలు లేని మనుషులు ఉండరు. అందునా అందరికి ఆరోగ్యం, సంపాదన, పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఇవేగా కష్టాలు... ఇంకా ఇంతకన్నా ఏముంటాయి. మనం ఒక మానసిక ఆలంబన కోసం ఇటువంటివారిని నమ్మితే నమ్మచ్చు. వీరిని మనం భూమి మిద ఉన్న దేవతలు గ కొలుస్తాము. కానీ కొంతమంది మన బలహినతలని గమనించి మన మనసులతో, మన భావాలతో ఆడుకుంటున్నారు.
ఇలాంటివారితో జాగ్రత్త వహించండి.
Mothaniki maa soniya medam andhra rastranni 3du pranthalalo phye pranthanni vedadhise kostha rayala simalanu ITALY map la chesaru ame thelivethetalanu phogadala leka.........
Yesudas with Irumudi on Padunettambadi. .

Swamiyeeeee Saranam Ayyappoooooooooooo. .
Outstanding sculpture must & should visit in life time....
On Dating!!!
(Transcribed from a talk given by Swami Chinmayananda in 1984 in the U.S.A.)

There is nothing wrong with dating but ask yourself, “What do I want ...See More
ఇవాళ పేపర్లో ఆరుషి హత్య కేసు గురించి చదివిన తర్వాత మనసు వికలం అయింది. చిన్న వయసులో ఆమె స్నేహాలు, షికార్లు గురించి విన్న తర్వాత చాల బాధ పడ్డాను. ఈ మధ్య pubs లో, పార్టీస్ లో కూడా మైనర్ లు ఉంటున్నారు అని వార్తలు వస్తున్నై.

పిల్లలకు చిన్నతనం నుంచి తల్లితండ్రుల సంరక్షణ అవసరం. కానీ ఈరోజుల్లో తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం వలన పిల్లలతో సమయం గడపలేక పోతున్నారు. తాము సంపాదించినా డబ్బుతో పిల్లలు అడిగినవన్నీ అవసరం ఉన్నా, లేకపోయినా కొని ఇస్తున్నారు. పిల్లలను గారాబంగా చూస్తున్నాం...See More
ప్రఖ్యాత తెలుగు నవల, కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1891 లో తూర్పు గోదావరి జిల్లా పొలమూరు లో జన్మించారు. ఆయన సుమారు 75 కథలు, అనేక నాటకాలు, నాటికలు, నవలలు, అనువాదాలు వ్రాసారు.

ఆయన కథలలో 'గులాబీ అత్తరు' కథలో కళాపిపాస, భావ సౌందర్యం లేని చోట ఎంత విలువైన వస్తువైనా చిన్నబోతుంది అనే విషయం ఎంతో హృద్యంగా చెప్పారు.

ఇక వడ్లగింజలు అనే కథ, 'మనకి ఏ విషయం లోనైనా సామర్ధ్యం ఉంటె చాలదు, దానిని వెలికితీసే ఒక mentor మనకి కావలి అనే విషయం చెప్పారు. ఈ కథలో శంకరప్ప అనే ఒక చదరంగ ఆటగాడికి తను బస చేసిన పూటకుళ్ళమ్మ తన తెలివితో, ఎలా ప్రోత్సహించిందో తెలుసుకోవచ్చు.

ఇక ' మార్గదర్శి' కథ ఈరోజుల్లో కూడా మనకి ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ లాగా పనికొస్తుంది. ఇందులో ఒక బ్రాహ్మణ పిల్లడు, ఒక కోమట్ల కుర్రాడు ఎలా తమ దగ్గర ఉన్న అణా డబ్బుని ఉపయోగించారు అనే విషయంతో మొదలుపెట్టి ఆ బ్రాహ్మణ కుర్రాడు తమ వర్గానికి ఏమాత్రం సరిపడని 'వ్యాపారం' లో కోమట్ల కన్నా అధికంగ పేరు, డబ్బు సంపాదించాడు అని చాల అద్భుతం గ చెప్పారు. బిజినెస్ చేద్దాము అనుకునే వాళ్ళు అందరికి ఎరోజుకి కూడా ఇది ఒక మంచి పాఠం

ఇది రెండవ సంపుటి. ఇందులోనే ఇంకా 3 కథలు ఉన్నాయ్. చదవని వాళ్ళు తప్పకుండా చదవండి. ఇప్పటికే చదివిన వాళ్ళు తమ అభిప్రాయం చెప్పండి.
"The egoism of My devotees will vanish, if they have complete faith in Me."

--Sai Baba
మొదట 10 జిల్లాలతో కూడిన తెలంగాణా, తర్వాత హైదరాబాద్ తో సహా 10 జిల్లాల తెలంగాణా, ఆ తర్వాత 'ఏ పేచీలు లేకుండా, హైదరాబాద్ తో సహా 10 జల్లాల తెలంగాణా, ఆ పైన భద్రాచలం, ఇప్పుడు మునగాల తో కూడిన తెలంగాణా, ..... ఎన్ని కావాలండి వాళ్ళకి, రోజు రోజుకి లిస్టు పెరిగిపోతూనే ఉంది.
మిత్రులారా... ఈరోజు "ప్రపంచ ఊబకాయ దినోత్సవం".

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కాన్సర్, గుండెపోటు తర్వాత స్థానం ఊబకాయ సమస్య. ఒకప్పుడు పాశ్చ్యాత్య దేశాలకే పరిమితమైన ఈ సమస్య గత దశాబ్దం గా మన దేశంలోను ప్రవేశించింది. దీనికి కారణం భారతీయులు దేశీయ పద్ధతులను విడిచి విదేశీయ పద్ధతులను అలవాటు చేసుకోవడమే.

ప్రపంచీకరణ పుణ్యమా అని జరిగిన చాల మంచి తో పాటు ఈ పాశ్చ్యాత్య జీవన విధానం మన సమాజంలోకి చాప కింద నీరులాగా చోచ్చుకువచేసింది. మన ఆహార అలవాట్లు, జీవనశైలి, క్రమంగా విదేశీ విధానంలోకి మారిపోతున్నై. అసలే రోజువారీ పనులలో, విస్తరించిన యంత్రాల వాడకం, ఒకే చోట కదలకుండా పని చేసే పధ్ధతి వాళ్ళ ఈరోజు మనకు శారీరిక శ్రమ లేకుండా చేస్తున్నై. పైనుంచి మన మారిన ఆహార అలవాట్లు మనకు ఊబకాయ సమస్యని తెచ్చి పెడుతున్నై.

ఒక సర్వే ప్రకారం నడివయసు వాళ్ళకన్నా 7-26 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళలో ఈ ఊబ కాయ సమస్య ఎక్కువగా ఉంది.

ఈ ఊబకాయం వల్ల మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కీళ్ళ నొప్పులు వంటి బాధలే కాక, ఆడవారిలో సంతానలేమి సమస్య కూడా రావచ్చు.


మన దేశ సంస్కృతి మన ఆరోగ్యం కొరకు మనకు ఎన్నో విశిష్టమైన ఆచారాలు పద్ధతులు అందించింది. అవి అన్ని పాటించి మనం ఊబకాయ సమస్యను నివారించుకుందాం.
Spiritual Story : WHY WE SHOUT IN ANGER MUST READ

A Hindu saint who was visiting river Ganges to take bath found a group of family members on the banks, shouting in anger at each other. He turned to his disciples smiled and asked.

'Why do people shout in anger shout at each other?'...See More
మిత్రులారా... ఈ గ్రూప్ బ్రాహ్మణులకు మాత్రమె ప్రత్యేకం. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మరిచిపోలేని అనుభూతులు, ఈ వేదికలో పంచుకోండి. మీ బాధలు పంచుకోవడానికి కూడా మేము సిద్ధం. ఎన్నో విషయాల మీద మీ అనుభవాలు, భావాలు అన్నిటికి స్వాగతం.

తెలుగులో కానీ, ఇంగ్లీష్ లో కానీ, మీ అభిప్రాయాలు తెలపండి. మంచి మంచి ఫోటోలు, కవితలు, ఆహ్వానిస్తున్నాం.

కానీ మీ వ్యాఖ్యలు ఎవరిని నొప్పించె విధంగా ఉండ కూడదు అని మనవి.
సిడ్నీ లో ఈరోజు వందలాది మంది పురుషులు మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసారు. మరి మనం కుడా చేద్దామా?
నాగరికత మొదలైన తొలి శతాబ్దాలలో సమాజంలో స్త్రీలకు ఎంతో అత్యున్నత స్థానం ఉండేది. సమాజంలో, కుటుంబం లో ఆమెకు నిర్ణయాధికారం ఉండేది. దురదృష్ట వశాత్తు నాగరికత పెరుగుతున్న కొద్దీ, సమాజం లో ఆమె పాత్ర తగ్గిపోతు వచ్చింది. ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో స్త్రీలపై హింస, అత్యాచారాలు పెరిగిపోతున్నై. మగవారితో సమానంగా చదువుకుని, ఉద్యోగం చేస్తూ, కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తున్న మహిళలపై ఇంట్లోను, ఆఫీసు లలోను, పని చేసే చోట ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి.

వీటన్నిటికి ఒక సమాధానంగా ఈరోజు అంటే, నవంబర్, 25, అంతర్జాతీయంగా ' మహిళలపై హింసకు వ్యతిరేక దినం' పాటించాలని ప్రపంచ దేశాలు పూనుకున్నై. ఈ రోజుకు 'వైట్ రిబ్బన్' ను లోగో గ చేసాయి.

మనం కూడా స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం. దీనికి పునాది మన ఇంటి నుంచే వేద్దాం. మన పిల్లలకు, ముఖ్యంగా మగ పిల్లలకు మహిళలను గౌరవించే అలవాటు చేద్దాం. మన ఇంట్లో మహిళలకు తగిన స్థానం ఇద్దాం.

ఏమంటారు?
హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం.....
ఖలిల్ జిబ్రాన్ మహాశయుడి కవిత చూడండి:

ఆశావాది చూసేది ముళ్ళను కాదు --గులాబీని,
నిరాశావాది చూసేది ముళ్ళను--కాదు గులాబీని.
మిత్రులారా... ఈ గ్రూప్ కేవలం బ్రాహ్మణులకు మాత్రమె ఉద్దేశించ బడినది. దయచేసి ఇందులోకి బ్రహ్మణెతరులు ప్రవేశించవద్దు అని మనవి.
వందనం, వందనం, గిరినందిని ప్రియనందనా
వందనం కరివదన కరుణసదన నీ పదకమలములకిదే వందనం.

అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి
నెయ్యమున నీ చరణదాసుల కియ్యవా దేవాధిదేవా...See More
ఆశీర్వదించు సాయి...
Padma Mvs created the group.

No comments:

Post a Comment