Wednesday 12 February 2014

విజయనగరం రోటరీ క్లబ్ సిల్వర్ జూబిలీ వేడుకలకు అతిధి గా హాజరైన సి. బి. ఐ  పూర్వ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ గారు అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్ధులను, వారి తల్లి దండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. అందరికి ఉపయోగకరమైన కొన్ని హితోక్తులు చెప్పారు. ఈనాడు దినపత్రిక సౌజన్యంతో ఆయన మాటలు  క్లుప్తంగా మీ కోసం:

యువత కోసం:

1. పేదరికం లో పుట్టడం శాపం కాదు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదు. పేదరికం అనేది ఒక మానసిక స్తితి మాత్రమే. ఆలోచన, ఆత్మవిశ్వాసం, ఆచరణ ఉంటె విజయం సాధించవచ్చు. ఉదా: బి. ఆర్. అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి వారు.
2. యువత స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి వారిని ఆదర్శం గా తీసుకోవాలి.
3. యువతలో అద్భుతమైన శక్తి దాగి ఉంది. ధైర్యం తో ముందడుగు వేస్తె విజయం సాధించడం కష్టం కాదు.
4. లక్ష్య సాధనలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సమాజానికి కీడు చేసేవారు మానను ఇబ్బంది పెడతారు. ఎట్టి పరిస్థితులలోను బెదరకుండా మనకు ఎదురవుతున్న అవరొధాలకు ఎదురీదితే లక్ష్యం చేరుకోగలం.
5. బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, యువతకు ముఖ్యమైన శత్రువులు. యువత తమలో దాగి ఉన్న ప్రచండమైన శక్తిని వేలికితియాలి.
6. పెద్దలను గౌరవించాలి. చరిత్ర తెలుసుకోవాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.
7. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు అద్భుతమైనవి. పాశ్చాత్య పోకడలు పోకుండా, భారతీయ సంప్రదాయాలను గౌరవించాలి. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి.
8. క్రమశిక్షణ, మాటతీరు చాల ముఖ్యం.
9. కళాశాలల్లో చదివిన ప్రతి విద్యార్థి ఇదే కళాశాలకు నేను ముఖ్య అతిధిగా రావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి .
10. సమాజ హితం కోసం సేవ చేయాలి.
11. దేశ భవిష్యత్తు నిర్ణయించే శక్తి యువతకు ఉంది.
12. తన కోసం, తన కుటుంబం కోసమే కాకుండా, లోకం కోసం కుడా జీవించాలి.
13. నిత్యం మంచి పుస్తకాలు చదువుతూ ,ఉండాలి.
14. నిత్యం సుడోకు puzzle  solve చేయడం ద్వారా తెలివితేటలూ, జ్ఞానం పెరుగుతాయి.

తల్లిదండ్రుల కోసం :

1. తల్లిదండ్రులు తమ పిల్లలను స్వామి వివేకానంద లా పెంచాలి.
2. మనం నమ్ముకున్న విలువలు, సిద్ధాంతాల మిద జీవించే విధంగా తీర్చి దిద్దాలి.
3. ముఖ్యం గా ఆత్మస్థైర్యాన్ని అలవరచాలి.
4. పిల్లలను మార్కులు సంపాదించే యంత్రాలుగా తయారు చేయొద్దు.
5. ఐ ఏ యస్ , ఐ. పి. యస్, చదవాలి అని వారిపై ఒత్తిడి తేవద్దు.
6. వారికీ ఇంట్లో స్నేహపూరిత వాతావరణం కలిగించాలి.
7. పిల్లలకు బొధించెవన్ని తల్లిదండ్రులు తప్పక పాటించాలి.
8. సమస్యలు  వస్తే ధైర్యంగా ఎదుర్కొనగలెగె శక్తి, సంస్కారం, క్రమశిక్షణ,మంచి మాటతీరు , పెద్దలను గౌరవించే విధానం, కష్టపడే తత్వాన్ని తల్లిదండ్రులు విధిగా పిల్లలకు నేర్పించాలి.
9. చిన్నతనం నుంచి డబ్బు మిద వ్యామోహం పెంచకండి. డబ్బు మిద ఆశను దూరం చేస్తేనే సమాజంలో మీ బిడ్డ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు.
10. సూర్యోదయానికి ముందే చిన్నారులు నిద్ర లేవాలి. ధ్యానం, యోగ చేయిస్తూ మంచి ఆహారం అందివ్వాలి.
11. టీవీ లకు పూర్తిగా దూరం చేయాలి. చిన్నారులపై టీవీ , కంప్యూటర్ గముల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు కంప్యూటర్ ఎక్కువా వినియోగిస్తే  వారిపై దృష్టి సారించండి.
12. ఎత్తి పరిస్థితులలోను వారి చేతికి cellphone , iphone  లు ఇవ్వరాదు.
13. ఎక్కువగా facebook  ఉపయోగిస్తున్నట్టు తెలిస్తే వాటికి దూరం చేయాలి.
14. గత రోజుల్లో ఇంట్లో పెద్దవారు ఉంటె కధలు బోధించేవారు. ఆ కథల్లో ఏంటో నీతి ఉండేది. ప్రస్తుతం కధలు చెప్పేవారు కనిపించటం లేదు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేందుకు సమయం కేటాయించక పోవడంతో చాల సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి రోజు కథల ద్వారా మీ పిల్లల్లో విలువలు పెంచాలి.
15. ప్రతి ఇంట్లోమంచి  పుస్తకాలతో గ్రంధాలయం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజు పుస్తక పతనానికి సమయం కేటాయించేలా  పిల్లలను ప్రోత్సహించాలి.
16. మార్కులు ప్రామాణికం చేయకండి. చరిత్ర నేర్పించండి.
17. పిల్లల్లో ఆధ్యాత్మిక భావన పెంచండి.
18. దినపత్రికల్లో వచ్చే వార్తల మిద వారితో  చర్చలు చేయాలి.
19. మితిమీరిన ఖర్చులకు డబ్బు ఇవ్వరాదు.
20, పిల్లలకు డబ్బు కాదు, ప్రేమని పంచండి. వారి కోసం సమయం కేటాయించండి. ఆ సమయంలో మంచి విషయాలపై చర్చించండి.


No comments:

Post a Comment