Wednesday 12 February 2014

ఇంతవరకు వహ్చాక రాష్ట్రం విడిపోతుందా, కలిసే ఉంటుందా అనే విషయం మిద చర్చ అనవసరం. కానీ, కలిసి ఉండలేము-విడిపోదాము అని అమాయకులైన ప్రజలను కూడా రెచ్చగొడుతున్న వారికీ వారు అడిగిన తాయిలాలన్ని తాంబూలం లో పెట్టి ఇచ్చేస్తూ , విడిపోవద్దు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని గోలపెడుతున్న వారి అభ్యంతరాలను ఒక్కటి కూడా చెవిని వేసుకోకుండా, --పోనీ ప్రజలను వదిలేయండి, రాజకీయ కురువృద్ధుడు, మిత్రపక్షానికి చెందినా అద్వాని గారే ఈ విభజన చాలా అసంబద్ధంగా ఉంది, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది అంటున్న పట్టించుకోకుండా ఇంత మొండి వైఖరి ఎందుకు? ఏ రాజకీయ ప్రయోజనాలను ఆశించి?

మొత్తం ఈ రాష్ట్ర విభజనకు, ఇంతమంది ప్రజల ఉసురు కు కారణమైన ఆ మహిళ భారత దేశం లో పుట్టి ఉంటె అన్నదమ్ముల అనురాగం, ఆప్యాయత వంటి భావాలకు అర్ధం తెలిసేదేమో. కుటుంబ వ్యవస్థకు పెద్దగ పట్టింపు లేని విదేశంలో పుట్టినవారికి ఇక్కడి ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి?

No comments:

Post a Comment