Monday 24 February 2014

మిత్రులారా... ఈరోజు "ప్రపంచ ఊబకాయ దినోత్సవం".

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కాన్సర్, గుండెపోటు తర్వాత స్థానం ఊబకాయ సమస్య. ఒకప్పుడు పాశ్చ్యాత్య దేశాలకే పరిమితమైన ఈ సమస్య గత దశాబ్దం గా మన దేశంలోను ప్రవేశించింది. దీనికి కారణం భారతీయులు దేశీయ పద్ధతులను విడిచి విదేశీయ పద్ధతులను అలవాటు చేసుకోవడమే.

ప్రపంచీకరణ పుణ్యమా అని జరిగిన చాల మంచి తో పాటు ఈ పాశ్చ్యాత్య జీవన విధానం మన సమాజంలోకి చాప కింద నీరులాగా చోచ్చుకువచేసింది. మన ఆహార అలవాట్లు, జీవనశైలి, క్రమంగా విదేశీ విధానంలోకి మారిపోతున్నై. అసలే రోజువారీ పనులలో, విస్తరించిన యంత్రాల వాడకం, ఒకే చోట కదలకుండా పని చేసే పధ్ధతి వాళ్ళ ఈరోజు మనకు శారీరిక శ్రమ లేకుండా చేస్తున్నై. పైనుంచి మన మారిన ఆహార అలవాట్లు మనకు ఊబకాయ సమస్యని తెచ్చి పెడుతున్నై.

ఒక సర్వే ప్రకారం నడివయసు వాళ్ళకన్నా 7-26 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళలో ఈ ఊబ కాయ సమస్య ఎక్కువగా ఉంది.

ఈ ఊబకాయం వల్ల మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కీళ్ళ నొప్పులు వంటి బాధలే కాక, ఆడవారిలో సంతానలేమి సమస్య కూడా రావచ్చు.


మన దేశ సంస్కృతి మన ఆరోగ్యం కొరకు మనకు ఎన్నో విశిష్టమైన ఆచారాలు పద్ధతులు అందించింది. అవి అన్ని పాటించి మనం ఊబకాయ సమస్యను నివారించుకుందాం.

No comments:

Post a Comment