Sunday 16 February 2014

భగవద్గిత:

 కృష్ణ పరమాత్ముడు అర్జునునికి యుద్ధ క్షేత్రం లో బోధించిన భగవద్గీత నిస్సంశయంగా ప్రతి యుగానికి, ప్రతి తరానికి అన్వయించే గ్రంధం. ఇప్పుడు చెప్తున్న వ్యక్తిత్వ వికాస పాఠాలు, crisis management course  లు, అన్నిటిని నిక్షిప్తంచేసుకొన్న ఒక జ్ఞాన జలధి గీత. అందులో నుంచి ఎవరికీ వారు వారి ఓపిక కొద్ది జ్ఞానమనే ఆణిముత్యాలను వెలికి తీసుకోవచ్చు. మన భారతీయ ధర్మ గ్రంథాలలోని ఇంకో మహత్యం ఏమిటంటే, వాటిని ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు మనకు కొత్త కొత్త భావాలు బోధ పడతాయి. అలాగే, గీత లోని భావాలు, ఈ రోజుల్లో అన్ని రంగాల వారికీ కూడా వర్తిస్తాయి, విద్యార్ధులు, పారిశ్రామిక వెథ్హలు, రాజకియ నాయకులూ, కుటుంబం, ఇలా ఒకటేమిటి అన్ని రంగాల వారికీ వర్తిస్తాయి. ఒక సారి  క్లిష్టం గా అనిపించినవి మరో సారి చదివినపుడు సులభముగా అర్థం అవుతాయి.వయసు పెరుగున్న కొద్ది వాటిని చదివినపుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.

భగవద్గిత లోని చాలా శ్లోకాలలో, మన జీవన యానానికి సంబంధించిన సందేశాలు ఉన్నప్పటికీ నాకు చాల ఇష్టమైన శ్లోకాలు:

1. యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదెవెతరొ జన:
    స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే:

శ్రేష్టుడైన వాడు ఆచరించిన ధర్మమునె ఇతరులు కూడా ఆచరించెదరు.అతడు నిల్పిన ప్రమాణములను లోకులందరూ పాటించెదరు..
    అంటే మన తరవాతి వారు, మన పిల్లలు బాగుపడాలి, మంచి బుద్ధులు నేర్చుకోవాలి అనుకుంటే ముందు మనం ఆ ధర్మాన్ని ఆచరించాలి. మనం ఆదర్శ వంతులమైతే, మనలను అందరు అనుసరిస్తారు.

2. ధ్యాయతో విషయాన్ పుంస: సంగస్తె శూపజాయతె!
    సగాత్సంజాయతె కామా: కామాత్ క్రొధొభి జాయతే..

ఐహిక విషయాల గురించి ఎల్లపుడు ఆలోచిస్తూ ఉంటె వాటి మిద ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణ వల్ల కోరిక  పెరుగుతుంది. కోరిక తీవ్రత వల్ల కోపం పుడుతుంది.

3. క్రొధొద్భవతి సమ్మోహ: సమ్మొహాత్ స్మ్రుతి విభ్రమ:
    స్మ్రుతి భ్రంశాద్బుధ్ధి నాశొ, బుద్ది నాశాత్ ప్రనస్యతి:

 క్రోధము వలన వ్యామోహము కలుగును..వ్యామోహము వలన అవివేకము ఆవహిస్తుంది. అవివేకము వలన మతి భ్రమిస్తుంది.( ఉన్న మతి పోతుంది) దాని ఫలితంగా బుద్ది నశిస్తుంది. బుద్ది నశిస్తే సమస్తం నాశన మైనట్లే.

ఎంత చక్కటి వివరణ? న్యాయమైన కోరికలు మనిషి ఉన్నతికి తోడ్పడతాయి. మితి మీరిన కోరికలు, అసంబద్ధమైన కోరికలు, పైన శ్లోకాలలో చెప్పినట్లు క్రమ క్రమంగా మనిషి వినాశనానికి దారి తీస్తాయి.

కాలికి చెప్పులు లేనివాడు, కాళ్ళు లేనివాడిని చూసి, నాకు నడవడానికి కాల్లైనా ఉన్నాయి అని సంతృప్తి పడితే పరవాలేదు, కాని కాలికి చెప్పులు లేని వాడు నాకు కారు లేదే అని బాధ పడినపుడే సమస్యలు వస్తాయి. కోరికలు న్యాయమైనవి అయితే మానవుడు న్యాయమార్గంలో వాటిని తీర్చుకోవడానికి కష్టపడతాడు. కానీ అన్యాయమైన కోరికలు మానవుడిని అవినీతి మార్గములో నడిపించి చివరకు అధ:పాతాళానికి తోసేస్తాయి.

No comments:

Post a Comment