Thursday 20 February 2014

మోకాళ్ళ నొప్పులు స్త్రీల లోనే ఎందుకు ఎక్కువ?

స్త్రీలకు తుంటి భాగం మగవారికన్నా విశాలంగా ఉంటుంది. మోకాలుపై వత్తిడి ఎక్కువ ఉంటుంది. తుంటి విశాలంగా ఉండడం వాళ్ళ తొడ కండరాలు సాగి, మోకాలి కండరాలలో నొప్పి వస్తుంది.  పురుషులలో కన్నా స్త్రీలలో కండ కుడా తక్కువే. స్త్రీల కండరాలు వదులుగా ఉంటాయి. అందువల్ల మోకాలుకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేవు. తుంటి విశాలంగా ఉండడం వాళ్ళ స్త్రీలు బరువు పెరిగేకొద్దీ తుంటి భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. దానితో ఆ భాగం ఇంకా విశాలమై మోకాళ్ళ మిద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సాధారణంగా స్త్రీలు ఒక కిలో బరువు పెరిగితే ఆరు రెట్లు ఒత్తిడి మోకాలు మిద పడుతుంది. కాన్పుల తరువాత స్త్రీలు బరువు పెరుగుతారు. స్థులకాయుల్లొ మోకాలి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మహిళలు మెనోపాజ్ దశలో హార్మోనుల అసమతుల్యత వల్ల ఎముకలు గుల్ల బారుతాయి. అందువల్ల ఈ దశలో వారికీ మోకాలి నొప్పి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్న స్త్రీలలో కుడా ఎముకలు గుల్లబారే అవకాసం ఎక్కువ. ఈ అన్ని కారణాల వల్ల స్త్రీలలో మోకాలి నొప్పి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.  ప్రతిరోజూ వ్యాయామం, నడక ఆహార నియమాలు పాటిస్తే ఈ సమస్య నుంచి కొద్దిగా తప్పించుకోవచ్చు.

No comments:

Post a Comment