Monday 24 February 2014

తనకెంత మేలు చేసిన
మనమున కింపైన పనులు మసలిన దాసీ
వనితల కెన్నటి కైనను
చనవిచ్చి మెలంగరాదు జగతి కుమారీ!

పనివాళ్ళు మనకు ఎంత మేలు చేసినప్పటికీ, ఎంత మంచిగా ఉన్నప్పటికీ, వారికి అతి చనువు ఇచ్చి ఇంట్లో విషయాలు, వారికి చెప్పరాదు

చెప్పెడి బుద్ధుల లోపల
దప్పకు మొకటిన సర్వ ధర్మములందున్
మెప్పొంది ఇహ పరంబుల
తప్పింతయు లేక మెలగ దగును కుమారీ!

పెద్దవారు చెప్పిన ధర్మ బద్ధమైన సూక్తులు, నీతులు విని, మనసున నిలుపుకొని, వాటిని అన్ని వేళలా పాటించి ఏ పొరపాట్లు, తప్పులు చేయకుండా వ్యవహరించి పుట్టినింటికి, మెట్టినింటికి మంచి పేరు
తేవలయును .

నోరెత్తి మాటలాడకు,
మారాడకుకోప్పడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగకు
మీరకుమీ యత్తపనుల మెలగు కుమారీ!

అత్తవారింట్లో ఒక కోడలు మెలగ వలసిన పద్ధతులు చెప్తున్నారు కవి ఈ పద్యంలో. అత్తవారింట్లో గట్టిగ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా, ఎదురు చెప్పకూడదు. ఎవరైనా కోపగించుకొన్నా మనం చేసే మర్యాదలలో తక్కువ చేయకూడదు. అలాగే అత్తగారు చెప్పిన మాట దాటకూడదు. ఈ విధంగా అత్తవారింట్లో మసలుకోవాలి.

No comments:

Post a Comment