Friday, 11 September 2015

విదుర నీతి 11.
కాలం నడుస్తోంది. చక్ర భ్రమణం సాగిపోతోంది. పాండవులు, అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తిచేసారు. వాళ్ళిప్పుడు యుద్ధసంరంభంలో ఉన్నారు. వాళ్ళ పర్స్థితి తెలుసుకుని రమ్మని మహరాజు సంజయుడిని పంపుతారు. తిరిగివచ్చిన సంజయుడు మహారాజును, అతను చేసిన తప్పిదాలకు పరిపరివిధాల నిందిస్తాడు. రేపు సభలో కలుసుకుందామంటాడు. ఆ క్షణం నుండి మహారాజు అశాంతికి గురి అయ్యాడు. అన్నం రుచించదు. నిద్రపట్టదు. ఏదో తెలియని భయం. ఆందోళన అనవసర ఆరాటం. ఆ స్థితిలో విదురునికి కబురు పెడతాడు. విదురుడు వచ్చి, "మహారాజా! మీకెందుకు అలజడి, ఆరాటం, అశాంతి, ప్రశాంతతను కోల్పోవడం.. అంటూ తన నీతి ప్రబోధాన్ని ప్రారంభిస్తాడు.
"బలవంతులతో పోట్లాట పెట్టుకునేవారికి భయం తప్ప నిద్ర రాదు. ఆరంభ శూరత్వంతో ప్రారంభిస్తారు. "సై" అంటే "సై" అంటారు కానీ, తీరా రంగంలోకి దిగాల్సివస్తే దిగులుపడిపోతారు. పక్కచూపులు, పిక్కబలం, ఇదీ పరిష్తితి. మీకటువంటి స్థితి లేదనుకుంటాను.
ఇతరుల సంపదలు హరించినవారు, అత్యాశతో ప్రవర్తించేవారు, చోరులు, స్త్రీలపై అఘాయిత్యాలు చేసేవారు, ప్రతిక్షనం ప్రమాదాన్ని శంకిస్తూ బ్రతుకుతారు. ఇవేమీ తమవద్ద లేవు. అటువంటప్పుడు నిద్ర రాకపోవడానికి కారణం తెలియటం లేదు.
త్రిలోకాధిపత్యాన్ని కూడా పొందగల ధర్మపరుడే యుధిష్టిరుడు. అతని సోదరులు అతనికి వందిమాగదులు కాదు. చక్రపరిరక్షకులు. వారు నా పిల్లలే అని మీరు ఎప్పుడైనా తెలిచారా? మీకు ఇన్ని నూకలు వెయ్యడానికైనా అసమర్ధులైన ఆ దుష్ట చతుష్టయం వలన కదా, మీకు ఈ దుర్గతి, అశాంతి, నిద్రరాకపోవడం.
శ్రద్ధాసక్తులతో, సత్కర్మలు చేసే, ధర్మపరులని పండితులంటారు. దైన్యం వారి దరిచేరదు. ఇంకా వారు పొగడ్తలకు పొంగిపోరు. దూషణభూషణలు సమంగాతలుస్తారు. సర్వులను సమదృష్టితో చూస్తూ ఆగ్రహావేశాలకు లొంగని, మనస్తత్వంతో ప్రవర్తించేవారిని నిజమైన విద్వాంసులుగా లోకం తలచి, గౌరవిస్తుంది. ధర్మం ఎక్కడ శాశ్వతంగా సురక్షితంగా ఉంటుందంటే--అప్రస్తుత , అనవసర ప్రసంగాలు జరగని చోటున, అసాధ్యమైన విషయాలు, వస్తువులకు ఆశపడకుండా వుంటారే--అక్కడ, కష్టాలకు కృంగక, ఆరంభ శూరత్వంగా కాక ప్రారంభించే పనులందు దక్షాదక్షత కలవార్ని కూడా విద్వాసులని లోకం మెచ్చుకుంటుంది. వీరు సర్వదా సత్యానికి, ధర్మానికి కృతజ్ఞులై ఉంటారు. వీరు అసామాన్యులు, గంభీర గంగానది వంటివారని కూడా చెప్పవచ్చును. వీరు సర్వదా లోకసమ్రక్షణామూర్తులు, ధర్మ సమ్రక్షులే తప్ప, ఇతర మార్గాలనన్వ్వేషించరు. అపాయం లేని ఉపాయాలు, వ్యర్ధం కాని వాక్కు, వీరి స్వంతం, ఏ విషయాన్నాఇనా గ్రహించి, తగువిధంగా నడిపించగల శిష్టాచార్య మర్యాద కలవారు, ధీశక్తి సంపన్నులని వీరిని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇవన్నీ సధ్ధర్మపరుల వ్యవహార ఆవ్హార అనుసరణీఅయ విశేషాలు. ఇక మూర్ఖులు--వీరు అవిద్యప్రేరితులు, అహంకారులు, ఆలోచనారహితులు.
అక్షరం రాకపోయినా, సలక్షణ ఘనాపాఠీలవలె ప్రవర్తిస్తారు. విద్యాశూన్యులు, వివేకహీనులైన వీరు గర్వాహంకారాల విషయంలో ముందు వరులసో ఉంటారు. కర్తవ్యం విడిచి, ధర్మం మరచి ఫలమనుభవించ చూస్తారేకానీ, ఫలాపేక్ష రహిత జీవనానికి ముందుండరు. ఆకాశానికి నిచ్చెనలు వెయ్యడం, అలవిమాలిన ఆశ, ఆశయాలు వీరి సొత్తుగా తలుస్తారు. పొత్తులు పనికిరావు. వారి సొత్తు కావాలి ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోకుండా మీసాలు దువ్వుతారు. దరిద్రాన్నైనా అనుభవిస్తారు కానీ, ధర్మానికి తలఊపరు.. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియని పరమ మూర్ఖులు, తమకు తాము ప్రతిభావంతులుగా తలుస్తారు. అడగని సలహాలతో, అప్రస్తుత ప్రషంగాలు, అనవసర ప్రేలాపాలు, కుమ్మరిస్తారు. వీరికి ఎప్పుడూ ఇతరులలో దోషాలు తప్ప మంచి కనబదదు. అకారణ క్రోధం, అనవసర వైరం, తెచ్చిపెట్టుకుంటారు. మహారాజా! వీరుని బాణం వృధా కావచ్చుమేఓ కానీ పండితుడి తపోమూర్తి వాక్కు వ్యర్ధం కాదు..
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment