Friday 11 September 2015

విదుర నీతి 22
సాధకుల దృష్టిలో రెండే కులాలున్నాయి. ఒకటి భక్తిశృధ్ధలు, వినమ్రత కలవరు.(దైవీ స్వభావం ) రెండు అవి లేని వారు.(ఆసురీ స్వభావం ). ఇద్దరికీ సరిపోదు. అంటే దైవీస్వభావం కలవరు ఆసురీస్వభావం కలవారిని చులకనగా చూసి వెలివేస్తారని కాదు. దైవీ స్వభావులంటే 'సర్వభూత హితే రతా:' (వారు సర్వజీవుల శ్రేయస్సునికాంక్షించి వారి శ్రేయస్సు కొరకు పాటుపడువారూ అని అర్ధం. దైవీ స్వభావం వారు సత్వగుణ ప్రధానులు. తమ చెడునడతతో అకారణంగా ఇతరులను కష్టాలకు గురిచేసేవారు చెడ్డవారు. ప్రతిపనిని ఫలాపేక్షతో చేసే స్వార్ధ పరులు మూఢులు. నాగరికులై ఉండి ధర్మాన్ని పాటించనివారు నరాధములు. ఎంతో విజ్ఞానవంతులై ఉండి కూడా కేవలం భౌతిక వాదానికే కట్టుబడి దేవుని పట్ల అవిధేయత చూపువారు జ్ఞానశూన్యులు. మానవత్వం లోపించి రాక్షస ప్రవృత్తిలో ప్రవర్తిస్తూ దేవునిపట్ల భయభక్తులు బొత్తిగా లేనివారు అసురులు వీరెన్నడూ ఎన్నటికీ, ఎప్పటికీ భగవానుని కృపకు పాత్రులు కాలేరు.
అమాయకులను త్వరగా మార్చగలం కాని తెలివైనవారిని త్వరగామార్చలేం. అమాయకుల మనస్సు శుధ్ధిచేయబడిన వ్యవసాయ క్షేత్రం వలె ఉంటుంది. తెలివైన వారికి అది పూర్తిగా కలుషితమై ఉంటుంది. కాబట్టి ఇంద్రియములు చైతన్యవంతంగా ఉండడం వలన మనిషి మానసికంగాబలహీనమవుతాడు. అటువంటి ఇంద్రియములను కరిగించి, మనసును సమూలంగా శుధ్ధిచేయడానికి సాధన అవసరం. పొలంలో పంటలు పండిస్తారు. అందులో ఏ పంట పండిస్తామన్నది మన చేతిలో ఉంది. నేలను దున్నకుండా, నీరు పెట్టకుండా, ఎరువులు వెయ్యకుండా వదిలేస్తే అందులో కలుపుమొక్కలు పెరుగుతాయి. అలాగే మన శరీరం సాధన లేకుండా వదిలేస్తే చెడు అలవాట్లతో అది నాశనమైపోతుంది.
ప్రతివ్యక్తికీ స్వభావం వాస్తవంగా నిర్మలమే. కాని కామక్రోధాదులచే అది మలినమైపోతుంది. అన్నీ మనం అనుకున్నవి జరుగవు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను చూడవలసి వస్తుంది. అనేకమంది జీవితంలో జరిగే మంచి చెడులకు పొంగిపోవడం, కృంగిపోవడం మనం చూడవచ్చు. ఇక్కడితో ఆగిపోదు. మన దు;ఖాలకు కారణమనవారిపై పగద్వేషాలను పెంచుకుంటాం. మనకి అపజయం కల్గినపుడు లోపం మనలోనే ఉన్నా ఎదుటివారిని నిందిస్తాం.
సత్యము, జ్ఞానము, తపస్సు, ధృతి, మౌనము, ధర్మము, ధైర్యము మొదలనీవి సాత్విక గుణలక్షణాలుగా చెప్తారు. ఆత్మస్తుతి చేయకుండుట, ఢంబాచారము లకుండుట, తోటి ప్రాణులను బాధించకుండుట, సహనము, బాహ్యాంతర శుచి కలిల్గియుండుట, చిత్తచాంచల్యము లేకుండుట, మనో నిగ్రహం కలిగి ఉండుట, అహంకారం లేకుండుట, ఎల్లప్పుడు ఇష్టానిష్టముల ప్రాప్తి యందు సమభావము కలిగి యుండుట, మొదలైనవి ఆత్మజ్ఞానుల లక్షణాలు.
ఈ గుణాలున్నవారు ఆత్మజ్ఞానులు, బ్రహ్మనిష్టులు, పరమభక్తులై ఉంటారు. సత్వగుణమువల్ల నిత్య అనిత్య వస్తు వివేకజ్ఞానము కలుగుతుంది. సత్వగుణము అభివృధ్ధిలో ఉండగా మరణించిన వారు ఉత్తమ్జానులు చేరుకున లోకమును చేరుకుంటారు. వివిధ విషయాలలో సాత్వికత ఇలా ఉంటుంది.
శ్రధ్ధ : శాస్త్రాలు చదువకున్నా ఉత్తమ ఆలోచనలు కలిగి ఆచరణలో ఆ ప్రకారం నడచుకున్నవాడు శ్రేష్టుడు. ఇటువంటి శ్రద్ధ్ధ సాత్విక శ్రధ్ధ అవుతుంది.
2. సాత్వైకాహారం: ఆయుష్షుని, ఆరోగ్యాన్నీందించే ఆహారమే సాత్వికాహారం.
3. సాత్విక య్జము. ప్రతిఫలాపేక్ష లేకుండా శాస్త్రోక్తముగా ఏ యజ్ఞము చేసిననౌ అది సాత్విక య్జమే.
4. సాత్వికదానం: ప్రయుపకారము చేయలేనివారికి ఇచ్చు దానము , ప్రతిఫ్లాపేక్ష లేకుండా చేసే దానము
5.సాత్విక జ్ఞానము: ఏ జ్ఞానము సర్వజీవరాశులయందు ఆత్మను నాశనరహితముగా, ఒకటిగా చూచుచున్నదో, ఆ జ్ఞానము సాత్వికజ్ఞానము.
6.సాత్విక ధర్యం: మనసు తప్పుడు మార్గంలో పయనించకుండా ఉంచగలుగుతున్నదే సాత్విక ధైర్యము.
7. సాత్విక బుధ్ధి: ఏ బుధ్ధి బంధహేతువగు కర్మమార్గమును, మోక్షహేతువగు నివృత్తి మార్గమును, కర్తవ్యాకర్తవ్యములను, భయాభయములను, సంసార బంధమును, సంసార నివృత్తిని ఉన్నది ఉన్నట్లుగా ఎరుగుతున్నదో దానిని సాత్విక బుధ్ధిగా చెప్పబడుతుంది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment