Friday, 11 September 2015

విదురనీతి 5
తరువాతి కాలంలో,ఒకసారి వేటనిమిత్తం శంతనుడు, యమునాతీరప్రాంతాలకు వెళ్ళ్గా, అక్కడ అపురూప సుగంధవాసనలు, నాసికకు సోకగా, ఆ సుగంధాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాడు. అక్కడ అతిసామాన్యంగా కనుపించే ఒక అందాల భామను చూస్తాడు. ఆమె దాశరాజు కుమార్తె అని తెలుసుకొని, మొహానికి లొంగిపోయి, ఆమెను వివాహం చేసుకోవడానికి అనుమతి అడుగుతాడు దాశరాజుని. నా బిడ్డకు పుట్టిన కుమారునికే రాజ్యం ఇవ్వాలి అనే షరతుకు ఏమి చెయ్యాలా అని ద్వైధీభావంలో పడతాడు. తండ్రి అవస్థను చూసిన గాంగేయుడు, దాశ్రాజును కలిసి నీ మనుమలకు రాజ్యాధికారం ఇవ్వడంకోసం, నా తండ్రికి ఏది ఆననదం చేకూరుస్తుందో అది ఆయనకు అందివ్వడం కోసం, నేను వివాహం చేసుకోను, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాదు. అడ్డంకి తీరటంతో, దాశరాజు కుమార్తె సత్యవతితో శంతనుని వివాహం జరుగుతుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. వారిరువురు కూడా బలపరాక్రమాల గర్వంతో ఒకడు, కామోద్రేకంతో, మరొకడు మరణిస్తారు. వారిరువురికీ సంతానం లేదు.
వంశసంరక్షణ కోసం మహారాణి సత్యవతి గాంగేయుని పిలిచి, నీ ప్రజ్ఞ పక్కనపెట్టి వివాహం చేసుకోమని భీష్ముని అర్ధిస్తుంది. అయితే, భీష్ముడు మాట తప్పనని చెప్తాడు.
సత్యవతికి పరాశత్ర మహర్షి కరుణతో "కృష్ణద్వైపాయనుడు" అనే కుమారుడు కలుగుతాడు. అతడు "నీవు పిలిచినప్పుడు వచ్చి తప్పక నీ సేవ చేసుకుంటాను" అని మాట ఇస్తాడు. ఈ సమయంలో ఆమెకు అతను గుర్తుకు వస్తాడు. సరస్వతీ నదీతీరంలో లో ఉంటున్న "కృష్ణద్వైపాయనుడు" ఆమెస్మరించినంతనే వచ్చి అంజలి ఘటించి, తనను పిలిచినా కారణం అడుగుతాడు. అప్పుడామె పరిస్థితిని వివరించి, " నాయనా! ఈ వంశ జ్యష్టుడు, పవిత్ర గంగాసుతుడు, భీష్మినితో ఆలోచించి, ఈ వంశ రక్షణానికి సహాయం చేయమని అర్ధిస్తుంది. ఒప్పుకుంటాడు వ్యాసుడు. భీష్ముడు, తన సోద్రులు అయిన చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు, కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలతో వివాహం చేయించాడు, కానీ ఆ సోదరులిద్దరూ నిస్సంతులై మరణీంచారు. అందువల్ల సత్యవతి, కోడళ్ళను పిలిచి వ్యాసుని ద్వారా సంతానాన్ని ప్రసాదించమని కోరుతుంది. వారు అలాగే అంటారు.
సత్యవతి పెద్దకోడలు అంబికను ఒప్పించినప్పటికీ, జడలు కట్టిన ఆయన స్వరూపం చూసి భయంతో ఆమె కళ్ళు మూసుకోవడం వల్ల పుట్టేవాడు మహాబలవంతుడౌతాడు కాని, పుట్టుగ్రుడ్డిగా పుడతాడు అని చెప్తాడు వ్యాసుడు. రెండవ కోడలు కూడా ఆయన రూపం చూసి భయపడి నివ్వెరపోయింది కాబట్టి ఆమెకు పుట్టే కుమారుడు "పాండువర్ణం" లో పుడతాడు అని మళ్ళీ చెప్తాడు వ్యాసుడు. అయినప్పటికీ ఆశ చావక మరల ఇంకోసారి అంబిక ను బ్రతిమాలుతుంది సత్యవతి. అప్పుడు తన దాసికి తన వేషం వేసి, వ్యాసుని వద్దకు పంపుతుంది అంబిక. ఆ దాసి ఆయనకు సర్వ సపర్యలు చేసి, ఆయన పట్ల ఎంతో భక్తి గౌరవాలు చూపించి ఆయనను సేవించుకుంది. బయటికి వచ్చిన వ్యాసుడు తల్లితో, "అమ్మా! నన్ను, నా ఆకారాన్ని అసహ్యించుకుని, మీ పెద్దకోడలు తన దాసీని అంత:పురానికి పంపింది. ఆమె కడు అదృష్టవంతురాలు. ఆమె గర్భాన శాపమూర్తి అయిన యమధర్మరాజు సధ్ధర్మమూర్తిగా, సకలస్ద్గుణనిధిగా జన్మిస్తున్నాడు. " అంటాడు.
అలాగ జన్మించిన పరిచారిక కుమారుడే ధర్మవేత్త, సకలనీతిశాస్త్రవేత్త అయిన విదురుడు. కురువంశం నిత్యం స్మరించుకోదగ్గ మహనీయుడు ఈ విదురుడు అని అన్నీతెలిసిన భీష్ముడు అతనికి ప్రత్యేకత నిచ్చి, సర్వవిషయాలలో చిన్నవాడు అని తలువకుండా, జ్ఞాన వృధ్ధునిగా తలచి సలహాలు అడిగేవాడు. విదురుడు కూడా సమయసందర్భాలను బట్టి కురువంశర్క్షణకు, ధర్మరక్ష్ణకు, పరమనీతిమూర్తి అయి తన సలహాలు అభిప్రాయాలను తెలుపుతూ అందరిచేత ప్రశంసించబడుతున్నాడు. విదురుని రాజనీతి ప్రతిఒక్కరిని ఆలోచింపచేస్తుంది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment