విదురనీతి 44
కొన్నిసార్లు తను నమ్మిన విలువలకి భిన్నమైన పనులు చేయాల్సిరావడము అనివార్యమవుతుంది. మనిషి ఆశించినది ఆశించినట్లుగా జరగదు. తాను చేయాలనుకున్న పనులకి భిన్నమైన పని చేయాల్సివస్తుంది. ప్రతిచోట తను తలచిన విషయాన్ని ఆమోదించే సమ్యమనం సమాజానికి కానీ, మనుషులకు కానీ ఉండకపోయే సందర్భాలుంటాయి. అయితే ఇతరులకు అపకారం జరగనంతవరకు తను నమ్మిన పనిని చేయడం తప్పుకాదు. ఎదుటివారికి సత్యాల్ని విశదం చెత్యలేకున్నా తన ఆత్మ ముందు తను నిజాయితీగా ఉంటే మంచిది. ఇతరులకు సాద్యమైనంత ఎక్కువ ఉపకారం, తక్కువ అపకారం జరిగే విధంగా మన పనులు ఉండాలి. అంతరాత్మ సాక్షిగా వ్యవహరించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక మనిషికి దీక్షాదక్షతలతో పాటు నిజాయితీగా ఉండటం, అవిశ్రాంతంగా పరిశ్రమించడమే ప్రధానం.
మనోనిగ్రహమూ, సయ్తపరాయణత్వమూ, ధర్మపాలన నిరతీ, జీవితానికి అవశ్యమైనవి అని నేను విన్నాను. పురుషుడు హృదయకవాటం తెరచి ధైర్యంగా ప్రియాప్రియాలను సమదృష్టితో చూదగలగాలి. ఇతరులు నిందించినా తిరిగి నిందించకూడదు. అందువలన ఎదుటివారి క్రోధం వారినే హరిస్తుంది. ఆ క్రోధం వారి పుణ్యాన్ని కూడా నశింపచస్తుంది. పరులను అవమానించరాదు. మనను గురించి ఎవరైనా పరుషంగా భాషిస్తూంటే అకారణంగా మనను నిందిస్తుంటే వాడు మన పుణ్యఫలాన్ని పెంపొందిస్తున్నాడని సంతోషించాలి. వాస్త్రం ఏరంగు నీటిలో ముంచబడితే ఆ రంగునే పొందుతుంది. అదే విధంగా సజ్జనుడైన వానిని దుర్జనుడు సేవిచి సజ్జనుడౌతాడు. మహాతపస్వి అయి ఉండి కూడా చోరునీ, మూర్ఖుని సేవిస్తే ఆ తపస్వి కూడా మూరుఖుడే అవుతాదు. పరిసరాలు, పరిజనులూ తమ ప్రభావాన్ని ప్రసరింపచేస్తూంటారు.
ఇతర్ల విషయంలో పరుష ప్రసంగాలు చెయ్యనివాడు, ఇతరులచేత అవమానితుడై కూడా ప్రతీకారాన్ని తలపెట్టనివాడూ, ఏ అవమానమూ పొందికూడా ఇతరులపై ప్రతీకారచర్యలకు ఆలోచించనివాడూ, స్వర్గానికి వస్తున్నప్పుడు దేవతలు వానికి స్వాగతం పలుదుతారు. మౌనం కంటే సత్ధర్మం ఇంకొకటి లేదు. ప్రియభాషణం ద్వితీయ స్థానము. సత్యంతో పాట్ అది ప్రియంగా ఉంటే, ధర్మసమ్మతం అయితే, ఆ వాక్కు సర్వవిధాలా ఉత్తమమైనది.
(ఇంకా ఉంది )

No comments:
Post a Comment