విదురనీతి 26
మానవసేవ చేసినా, మాధవసేవ చేసినా చిత్తశుధ్ధి, నిస్వార్ధం, ఫలాపేక్ష రహితంగా చెయాలి. అప్పుడే అది నిజమైన సేవ అవుతుంది. అది నిజమనిన మంచితనమని కూడా అనిపించుకుంటుంది. మంచిగా జీవెంచాలే తప్ప మంచివాడిగా నటించకూడదు. మన అంతశ్శత్రువులతో నిత్యం పోరాడుతూవాటిని జయించాలి. ఈ పోరాటంలో అనేక కష్టాలు ఎదురఔతాయి. నష్టాలు కలిగినా పోరాటాన్ని ఆపకుండా ప్రయత్నంచాలి.
కనబడని శత్రువు.
మనకు కాని వారందరూ శత్రువులే అంటుంది ధర్మశాస్త్రం. శత్రుసమూహంలో కంటికి కనబడేవారు బాహ్య శత్రువులు. కనబడకుండా మనల్ని అంతమొందించే మరో వర్గం అంతశ్శత్రువులు. అదృశ్యరూపంలో మనలోనే ఉంటూ మట్టుపెట్టే మహా శత్రువు కోపం.
కొపం బహుచెడ్డ గుణం. కోరికలు తీరనప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వివేకం నశిస్తుంది. ఆ వెంటనే మనసు అదుపు తప్పుతుంది. మాట్లాడే భాషలో మర్యాద లోపిస్తుంది. సత్ప్రవర్తన కొరవడుతుంది. ఈ కారణంగా వ్యాకులత, అశాంతి, హింస మొదలైన వినాశకర భావాలు ఉత్పన్నమవుతాయి. మిత్రులను, సన్నిహితులను, అన్నదమ్ములను, చివరికి తల్లితండ్రులను సైతం లెక్కచేయక ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడేలా చేస్తుంది ఈ గుణం. కోపం కారణంగా హృదయం నిప్పుల కుంపటై మనసు మనిషికి దూరమై పోతుంది. క్రోధావేశ పూరితుడు ధర్మ భ్రష్టుడవుతాడు అని ధర్మ శాస్త్రాల వాక్కు.
ఆసక్తి, శ్రధ్ధ, ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అచిరకాలంలోనే పరం ఆధ్యాత్మిక శాంతినీ పొందుతాదు. జ్ఞాన సముపార్జన జరగాలంటే, విచక్షణను చక్కగా వినియొగించుకోవాలి. సత్యమైనద్--అసత్యమైనదీఇ, శాశ్వతమైనదీ-అశాశ్వతమైనదీ , తగినదీ-తగనిదీ వంటి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలిపేది విచక్షణ. మనం ఎంత చక్కగా విచక్షణను ఉపయోహించుకుంటే అంత చక్కగా జ్ఞానవతులం అవుతాం. విచక్షణ నోరు నొక్కితే అంతా అపసవ్యమే. అప్పుడు శాశ్వత సుఖానికి బదులు శాస్వత దు:ఖాన్ని పొందుతాం.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment