Friday, 11 September 2015

విదురనీతి 8
ద్యూతక్రీడకు పాండవులను ఆహ్వానించాలనే దురాలోచన కౌరవులు చేస్తున్నట్టు తెలుసుకున్న విదురుడు ధృతరాష్ట్రుని కలిసి దీనిని ఆపమని వేడుకొంటాడు. పుత్రప్రేమ కారణంగా మహారాజు ఏమి మాట్లాడలేడు. ధర్మరాజు సతీసోదర సమేతంగా హస్తినకు వచ్చాక, శకుని ధర్మరాజును జూదానికి ఆహ్వానిస్తాడు. వద్దు వద్దని ధర్మరాజు ఎంత వారించినా వినని శకుని తొ విధిలేని పరిస్థితులలో ఆడడానికి సిధ్ధం అయ్యాడు. అది చూసి సహించలేని విదురుడు, "మహారాజా! దీనినాపండి. ఇది ఎవ్వరికీ శ్రెయస్కరం కాదు. నా మాట మన్నించండి" అని ప్రార్ధించాదు. ఆయన వినడం లేదు. మళ్ళీ విదురుదు "లోకం, ధర్మ తెలియక ప్రవర్తిస్తున్నారో...దారుణాలకు నిలయంగా తలుస్తున్నారో, నాకు అర్ధం కావటం లేదు" అనుకుంటూ, " ఈ ద్యూతము సర్వనాశనకరము. వివేకవంతులు దీని జోలికి వెళ్ళరు. కేవలం ముందు చూపు లేనివారు మాత్రమే అత్యాశతో ద్యూతక్రీడకు సిధ్ధమౌతారు. ఎంతటివారినైనా ఇది అణగద్రొక్కుంతుంది. ఆశల్ని, ఆశయాల్ని తలక్రిందులు చేస్తుంది. పరువు ప్రతిష్టలను మంటగలుపుతుంది. ఆన్నీ తెలిసిన మీరు దీనిని నివారించండి. సోదరులిరువురు సుఖసంతోషాలతో మెలిగేటట్లు చూడండి. మీ తమ్ముడు పాండురాజు మీ మేలు కోరాడేతప్ప, మీకు కీడు ఏనాడూ కోరలేదు. మీకు ఏ అన్యాయము చెయ్యలేదు. ఆ ధర్మబుధ్ధితో ఆ అధర్మక్రీడకు స్వస్తి పలకండి. అందరు సంతోషంగా ఉంటారు.
నాకు ధర్మం తప్ప మరొకటి తెలియదు. దానికి తప్ప మరిదేనికి నేను తలవంచను. నా హితోక్తి మీకు నచ్చకపోవచ్చు. అది మీ వ్యక్తిగతం. వంశం దృష్టిలో, ప్రజాసంక్షేమం దృష్టిలో ఈ ద్యూతక్రీడ ఆలోచన ఎటుచూసినా తగదు. నీకు దుర్యోధనుడు కుమారుడు. వాడు "కు"మారుడు. వానివలన ఈ కురువంశమే విచ్చిన్నమైపోతుంది.
ఒక్కసారి చరిత్రను తలుచుకోండి. తెలిసిన ఆ చరిత్ర తెల్పిన ఆఆ మాయనిమచ్చలద్వారా ప్రపంచం, ఆయా వంశాలు ఎలాగ సుఖశాంతులను పొందాయో తెలుసుకుంటే, మనంసన్మార్గం లో నడిచినవాళ్ళం అవుతాము. పాండవులు, నిన్ను అభిమానించిన, నీకు శ్రేయోభివృధ్ధిని కలిగించిన నీ తమ్ముడు పాండురాజు పుత్రులు. నిన్నభిమానించే ధర్మాత్ములు. నీ పిల్లల కన్న అధికంగా నిన్ను గౌరవించే సుపుత్రులు. ఇప్పుడు మౌనం పనికి రాదు. అది సమాధానం కాదు." అని ఎంతో నచ్చచెప్పాడు విదురుడు. ధౄతరాష్ట్రుడు మౌనం వీడలేదు. విదురుడు దుర్యోధనుని వైపు తిరిగి అతనితో "నాయనా! ఇది తగదు.తెలిసి, తెలిసి, చేతులారా మృత్యువునాహ్వానించి, నీ తల్లితండ్రులకు గర్భశోకం, మాకు తీరని దు:ఖం కలిగించకు" అని పలికాడు.
ఇది విన్న దుర్యోధనుడు అసహనంతో లేనిపోని పెత్తనాన్ని నెత్తిన వేసుకుని అలవసర ధర్మపన్నాలు చెప్పకు. నిన్ను అడిగినవారికి, ఓపికగా వినేవారికే ఈనీతిసూత్రాలు చెప్పు. అంతేకాని అనవసర అధిక ప్రసంగాలు చెయ్యక జరిగేదేదీ చూడలేననుకుంటే నిరభ్యంతరంగా నీ ఇష్టం వచ్చినచోటుకు పోవచ్చును. నిన్ను ఆపేవారు, అడ్డుకునేవారెవరూ ఇక్కడలేరు" అని నిష్టూరంగా పలికాడు.
అందుకు సమాధానంగా "దుర్యోధనా! చెప్పవలసిన వాడిని కాబట్టి, మహారాజు క్షేమం, మీ క్షేమం సదా తలచేవాడిని కాబట్టి నీకు అప్రియమైనా నా ధర్మంగా స్దుపదేశం చేసాను. విననంటే నీ ఖర్మ. కాని ఒక్కటి గుర్తుంచుకో! అరివీరభయంకరులు, ధర్మమూర్తులైనపాండవులతో నీ చుట్టూ ఉన్న భజనపరుల, భట్రాజుల మాటలు విని, ప్రాణాలపైకి తీసుకురాకు. వంశనాశనానికి తొందరపడకు. "ధర్మో రక్షతి రక్షిత: అన్నది సత్యము. నీవు చేసే పనులు నీకు సుఖ దు"ఖాలను ప్రసాదిస్తాయి. విన్నా, వినకపోయినా పెద్దవాడిగా చెప్పడం నా ధర్మం." అని పలికాడు విదురుడు.

No comments:

Post a Comment