Friday, 11 September 2015

విదురనీతి 16
పెద్దలు పిల్లలను లాలన చెయ్యలి. పిల్లలు పెద్దల పట్ల వినయ విధేయతలు కల్గిఉండాలి. ప్రతి ఇంట ఇదిముఖ్యం. స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వారిని సదా రక్షిస్తూ గౌరవించాలి. అంత:పుర రక్షణ గృహ యజమానిది. ఇంటి మంచి చెడుల బాధ్యత ఇల్లాలిది. దాత అందరికీ ఆరాధ్యుడవుతాడు. మంచిగా మాట్లాడేవారు మహనీయులఔతారు. సత్యవాక్పాలన వలన లభించే కీర్తి, శాశ్వతం. ఆచంద్రార్కం నిలుస్తుంది. మన ఆలోచన, బుధ్ధిని బట్టే మన సుఖసంతోషాలుంటాయి. తల్లిని, శిష్యులను, సేవకులను, తన ఇంటిని జాగ్రత్తగ సమ్రక్షించుకోవాలి. మనసులు, ఆలోచనలు ఏకమై ఏకరీతిన సాగేవరితో స్నేహం సర్వత్రా హర్షణీయం. నాస్తికుడు, ఏడుపుగొట్టువాడు, సోమరి వద్ద లక్ష్మీదేవి ఉండమన్నా ఉండదు. చదువురాని వాడు, రాజులేని రాజ్యం, సంతానం లెని స్త్రీ ల యొక్క జీవితాలు వ్యర్ధం. అసంతృప్తి, ఆత్మస్తుతి, సేవాదృక్పధం లేకపోవడం, అనాలోచిత కార్యాలు, అనవసర ఆర్భాటం మనుషులకు అసలైన శత్రువులు. సోమరితనం, మద, మోహ, చపలత్వ, ధూర్త, స్వార్ధ, అనవసర అసందర్భ ప్రసంగాలు అసలు పనికిరావు.
మృత్యువును ప్రాణీకోటికి ప్రాణాంతకంగా చెబుతారు. దీనికి రూపం లేదు. ఎలాగ మనల్ని ఎప్పుడు కబళిస్తుందీ చెప్పలేము. జీవుడుకామ, క్రోధ, లోభ, మద, బోహ మత్సరములనే ఆసురీప్రవృత్తులకు లొంగి, అందులో శ్ళేష్మమలో పడ్డ ఈగలాగ కొట్టుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాదు. దానినే మృత్యువు అని చెప్పవచ్చు. ఈ కామక్రోధాది అర్షడ్వర్గములతో ఎటువంటి బంధనం లేని వ్యక్తిని "బ్రహ్మజ్ఞాని" అంటారు. అతడు బ్రహ్మ భావంతో ఆ రూపమొంది ఆనందిస్తున్నాడు. ఈభావం కల్గినవాడు "మృతుడు" దాడు. అతనికి మృత్యువేలేదు. అలాగని తామరాకుమీద బీటిబొట్టు వలె ఉండి తరించడం "తత్సుమము" అయితే ఎందుకు కొరగాని వాడు "తద్భవమై" సంసారా తాపత్రయాలకు తహతహ లాడుతూ ఊర్ధ్వలోకాల బదులు, అధోలోకాలకు దారిచేసుకుంటున్నాడు. అందుకని, జ్ఞానం కలిగించే విషయాలు వినాలి. ఆ జ్ఞానంపై మనసును నిల్పి ఏకదృష్టితో, నిశ్చలమూర్తిగా ధ్యానం చెసుకుంటూ పరమ ప్రశాంతంగా ఉండాలి. ఈ ఆత్మ నిత్యచైతన్య స్వరూపంతో, బంధరహితమై బ్రహ్మానందమొందుతూ, నిత్యనిర్మల ప్రశాంత పరిశుధ్ధమై, ఆ పరబ్రహ్మలో లీనమీ ఆత్మానందం పొందుతుంది. ఇది అనుబవానికే తప్ప వర్ణనకు వీలు కాదు. ఇది సత్కర్మల వలననే సాధ్యము, లభించే అదృష్టము.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment