విదురనీతి 17
ప్రతిజీవి ఆత్మజ్ఞానం కలిగేవరకు కర్మలు చేస్తూనే ఉండాలి. నిరపేక్ష భావంతో (ఫలితం మీద దృష్టి లేకుందా ) చేసే కర్మలు సర్వపాపాలను దూరం చేస్తాయి. ఆమజ్ఞానంకలిగిన వ్యక్తికి ఆత్మాల్నందం కల్గుతుంది. అప్పుడు కలిగే బ్రహ్మభావం అంతా ఈశ్వరమయమేనన్న బుధ్ధిని ప్రసాదిస్తుంది. ఇక అప్పుడు ఏ బంధానికి తావుండదు. దేహాభిమానులకు చిత్తశుధ్ధి కలుగడానికి ఈ కర్మలు ప్రారంభించబడ్డాయి. ఇవి ప్రేరేపించబడి నియమిత ధర్మంగా కర్మలు చేస్తే, చిత్తం నిర్మలమవుతుంది. నిష్కామదృష్టి ఏర్పడి ఆత్మానందం పొందగల్గిన గమ్యం సునాయాసంగా చేరుకోగలుగుతాము. అది అనుభవించే ఆనందమే తప్ప కలనేము, వినలేము, అందుకే పెద్దలు ఇలా చెప్పారు. కోరికలు అజ్ఞానం కల్గించి వివేకాన్ని నాశనం చెయ్యడమే కాక, పురుగులా మొదలంట తొలిచేస్తాయి. కామంవలన క్రఒధం, క్రఒధంవలన మోహం, ఇలా అరిషడ్వర్గాలు ఆరూ ఒకదాని వెంట ఒకటి వారిని లోబరచుకొంటాయి. మందబుధ్ధులు ఈ హెచ్చరికలను విన్నా, తలకెక్కించుకోక, కోరికలకు బానిసై, కామంతో స్త్రీ సుఖానికై పరితపిస్తూ, పతనానికి దారిచేసుకుంటారు. వీరు నరకానికి అలంకారప్రాయులు. సంసారతాపత్రయాలకు, శారీరిక సుఖాలకు నిరంతరం పడే వ్యధే "మృత్యువు." దీనికి తగులుకున్నవాడు ప్రతిక్షణం చస్తూనే ఉంటాడు. ఈదేహం నశించేది అజ్ఞానం వలన. ఇది నశిస్తే, మృత్యువు నశించినట్లే. ఉదాహరణకు యోగులు వారి సాధనలో అనాయాసంగాకొన్ని శక్తులను పొందుతారు. అరి అవసరం కోసం, ఆపధ్ధర్మం కోసం. అలా కాక, తన శక్తులను గొప్పగా ప్రదర్శించేవాడు త్వరలో పతనమవుతాడు. చెవిటి , మూగ, జడుడువలే, ఉన్మత్తునివలే ప్రదర్శించేవారిని మహాత్ములంటారు. వారు ఈ జీవుల అదృష్టాన్ని బట్టి, ఈ లోకంలో సంచరిస్తూ, అన్యాయులను, అనాధలను, కర్మభ్రష్టులను, జన్మభ్రష్టులను...సమయ సందర్భాలను బట్టి తరింపచేస్తూ ఉంటారు.
జ్ఞాని చేయవలసిన పని బ్రహ్మజ్ఞాన్నన్ని గురించి ధ్యానించడమే. తెలుసుకోవడం వేరు, తెలుసుకుని తరించడం వేరు.సత్యాన్ని గ్రహించినవాడు జ్ఞాని. అనుభవించినవాడు బ్రహ్మజ్ఞాని. మృత్యువు వీరి దరికి చేరలేదు. వీనికి మృత్యువు, నరకమనేది వుంటాయని కూడా తెలియని, దివ్యావస్థలో ఉంటాదు. ఏవికారము లేని వాడు, నిర్మలుడు, సంశయరహితుని బ్రాహ్మణుడంటారు. ఇతడు పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించి, జగత్తు "మిధ్య" అని తెలుసుకుని "జ్ఞానసిధ్ధి" పొంది, తాను తరించడమే కాక, ఇతరులను కూడా తరింపచేయగల సమర్ధుడౌతాడు.
బుధ్ధిని ప్రకోపించే, ప్రేరేపించే ఇంద్రియాలను జయించి, మనసును తన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు లబించే దానిని "విద్య" అంటారు. దీనిని అనుష్టించిన వారిని "విద్వాంసులు" గా లోకం గుర్తించి, గౌరవిస్తుంది. విద్య నెప్పుడు బ్రహ్మచర్య నియమంతో గురువుల శుశ్రూష చేస్తూ ఒక ఉపాసనగా పొందాలి. ఈ జగత్తును శాశ్వత పరబ్రహ్మమని తలచిననాడే బ్రహ్మజ్ఞానం పొందగల్గుతాము. కాబట్టి మహారాజా! నీవు సర్వశంకలు విడిచిపెట్టి, ఆ వ్యాసమహాముని ఆశీస్సులు పొంది, ధర్మపధాన్ని అనుష్టించి, ధర్మమూర్తివై చరించు." అని విదురుడు ధృతరాష్ట్రునికి బోధించాడు.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment