విదుర నీతి 25
మదం:
మదం అంటే విపరీతమైన హద్దులు లేని అహంకారం. ఈ గుణం కల్గిన వారు వయోవృద్ధుల్ని, మేధావులను సైతం లెక్కచేయరు. అధికారం మదం కల్గినవాడికేమాతం అర్హత లేకున్నా, అనుభవంలేకున్నా తన క్రిందివారిపై పెత్తనం చెలాయిస్తాడు. వీరు ఎదుటివారిని తనకంటే తక్కువచేసి, వారిపై తమ పెత్తనం చలాయించుటకు, దుర్మాగ్రపు పనులు, దురాలోచనలు చేస్తారు. ఎంతటి నీచానికి అయినా పాల్పడుతారు. ఈ అహంకారము వలన ఎదుటివారిపై అసూయ పెరిగి, ఎదుటివారు తనకంటే ఉన్నత స్థితిలో ఉండుట, ఓర్వలేక, ఎదుటివారి నాశనమును కోరుకుంటూ ఉంటారు. చివరికి తామే నాశనమవుతారు. ఇది మరచి సత్యం, ధర్మం విడిచి,మదమెక్కి తమ జీవితములు అంధకారము చేసికొంటున్నారు. జ్ఞాని అయినవాడు ఉన్నతంగా (అహం విడిచి) ఎదుగుతున్నాడు.
మాత్సర్యం:
అనగా అసూయ. ఇది చాలా ప్రమాదకరమైనది. మాత్సర్యము వలన మానవుడు తనలోని మానవత్వాన్ని కోల్పోయి అశాంతితో ఆ జీవితాన్ని గడపడం జరుగుతుంది.
ఈ ఆరు దుర్గుణములు మాన జీవిత వికాసమునకు మానవజాతి శాతిమయ జీవనానికి అవరోధములు. మానవుడు జన్మించిన తర్వాత తన పెరుగుదలలో బాల్యమ్నుండి యౌవన దశకు, యౌవనం నుండి గృహస్థాశ్రమం, తర్వాత వృధ్ధాప్య దశకు చేరుకొని, చివరకు స్వర్గ, నరక ప్రాప్తి పొందుతాడు. ఆయా దశలలో సత్వ గుణముతో ఈ అరిషడ్వర్గములను జయించి, పుణ్యఫలాన్ని అధికం చేసుకొంటే, మోక్షప్రదమైన స్వర్గమును, లేదా నరకమును పొందుతారు.
మానవులంతా సత్వ , రజో, తామస గుణాలలో ఏదోఒకదానికి వశులై ఉంటారు. ఆయా గుణాలను అనుసరిస్తూ ప్రవర్తిస్తారు తప్పితే మరో రకమైన ప్రవర్తనను కలిగిఉండరు. విద్యావంతులమనుకునే వారు, మేధావులుగా తమను తాము పరిగణీంచేవారూ సైతం తమ తమ స్వభావాలకు విరుధ్ధంగా ప్రవర్తించలేరు. గుణం ఒకసారి స్థిరపడిన తర్వాత కొత్త దృక్కోణం అలవరచుకోవడం ఎవరికైనా కష్టమే. ఆధ్యాత్మికంగా ఎంతో ముందంజ వేసామనుకునేవారు సైతం లోలోపల కొన్ని ప్రత్యేక గుణాలకు లోబడిఉంటారు. ఏ కొద్దిమందో సత్యశోధనపట్ల ఆసక్తి చూపుతారు.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment