Friday 11 September 2015

విదుర నీతి 14
దండనీతితో ప్రభువు, సేవాగుణంతో స్త్రీలు, క్షమాగుణంతో బుధ్ధిమంతులు శ్రేయస్సును పొందుతారు. నోటిని అదుపులో పెట్టుకునే మితభాషి ఈ ప్రపంచాన్ని జయించగల ధీరుడు. గొడ్డలి దెబ్బ తిన్న చెట్టు చిగురుస్తుందేమో కాని, దెబ్బ తిన్న మనసు కోలుకోదు. శరీరానికి గుచ్చుకున్న అస్త్రాలను బయటికి తీయవచ్చును. కానీ, పరుషవాక్కులతో బాధపడే గుండేను ఉపశమింపచెయ్యడం జరగని పని. కొందరి జన్మకారణమో లేక ప్రారబ్ధమో కానీ బుధ్ధి మందగించినా, నశించినా పాపకార్యాలకు ముందుంటాడు. మంచి అన్నది వారికి కనబడక వారి నాశనానికి వారే బాటలు వేసుకుంటారు. ఇందుకు నిదర్శనం, నీ బిడ్డలే. పాండవులపై అకారణ ద్వెషం పెంచుకుని, అనవసర పగలు, ప్రతీకారాలు పెంచూని, ఎవరో తనకు అపకారం చేసినట్లు తెగ బాధపడుతూ, దారుణమారణ హోమానికి తలపడుతున్నాడు. కానీ పాండవ జ్యేష్టుడైన యుధిష్టరుడు, మిమ్మల్ని పెదతండ్రిగా, తమ శ్రేయోభిలాషిగా ఎంచి, మీ యందు గురుభావంతో మెలగుతున్నాడు.
వెయ్యి క్షెత్రాలు దర్శించినా, అన్ని పుణ్యతీర్ధాలలో స్నానం చేసిన ఫలం సర్వభూత సమవర్తనం వలన లభిస్తుంది. సమతాదృష్టి అహింసాబుధ్ధి అత్యంత శ్రేయస్కరమైనది. అంతేకాదు. అందరితో ప్రెమగా ఉండటం, మృదు సరస సంభాషణం మరింత పుణ్యప్రదం. ఆశ పెంచుకుంటూ పోతే, అది నెరవేరకపోయేసరికి, అధైర్యమొదుతారు. కోపం సంపదవృధ్ధికి పరమ అడ్డంకి. అసూయాపరునికి ధర్మమంటే తెలియదు. కాముకునికి సిగ్గు ఉండదు. ముసలితనం సౌందర్యాన్ని హరిస్తుంది. నీచుల్ని సేవించినందువలల ధర్మం నశిస్తుంది. దురభిమానం సర్వనాశనకారి. గర్వము పతనహేతువు. పగలు శ్రమపడితే రాత్రి సుఖనిద్ర పొందగలుగుతారు. సంవత్సరంలో ఎనిమిది మాసాలు శ్రమించి కూడబెట్టుకుంటే వర్షాకాలం నాలుగు నెలలు హాయిగా బ్రతుకవచ్చును.
మేధాసంపత్తి నుపయోగించి చేసే కర్మలు ఉత్తమమైనవి. బలప్రయోగం మధ్యమమ్మైతే, మిగిలిన ఏ పధ్ధతేఇనా అధమాధమంగా తలవాలి. మనలను ఇతరులు నిందిస్తే, సంతోషించాలి. తిడితే గౌరవించాల్లి. ఎందుకంటే, వారు మన పాపాల్ని స్వీకరించి, తమ పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నారు కనుక సర్వదా మనం కృతజ్ఞులమై ఉండాలి. సదాచారాన్ని, సనాతన ధర్మాన్ని సర్వదా సమ్రక్షించుకోవాలి. సంపదలు వస్తాయి, పోతాయి. మిగిలేది ఆచరించిన సదాచారం. చసుకున్న ధర్మం. వీటికి విరుధ్ధంగా నడిచేవాడు బ్రతికిఉన్న్నా చచినట్లే ! ఇది శాపం కాదు సత్యం.! మనస్సులో ద్వేషం రగులుతూంటే, అది హంసతూలికా తల్పమైనా ఆ జీవునికి నిద్ర రాదు. ఆ సమయంలో ఏదీ సంతోషాన్నివ్వదు. హితవాక్యాలు తలకెక్కవు. శాంతి ఎంత వెదికినా దొరకదు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment