విదుర నీతిలో వక్త విదురుడు. శ్రోతకంటే వయస్సులో చిన్నవాడు. అయినా జ్ఞానసంపదలో ఉంపదేశ సామార్థ్యంలో మిన్న. లోకతత్వం, లోకెశ్వర తత్వం తెలిసినవాడు. దాదాపు ఆరువందల శ్లోఅకాలతో ఒక మహానీతి శాస్త్రంగా రూపొంది మానవజాతికి శాశ్వతంగా ఒక మణిహారంగా అలరారుతున్నది ఈ విదురనీతి. మహాభారతం లోని ముఖ్యులు కౌరవులు, పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండవుల వనల తన కుమారులకు ఎటువంటి ముప్పు కలుగుతుందోనని భయపడుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అటువంటి భయస్థుడైన ధృతరాష్ట్రుడు మంచ్ హితవు చెప్పమని తన కొలువులోని విదురుణ్ణి కోరతాడు. ఆ సమయంలో విదురుడు ఎన్నో మంచి మాటలు చెబుతాడు. మంచి నీతులు కలిగి ఉన్నది కాబట్టి "విదుర నీతి"కి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది.
No comments:
Post a Comment