Friday, 11 September 2015

విదుర నీతి 20
ఏ మనిషికయినా తనను తాను తెలుసుకోవడానికి మించిన ఆత్మజ్ఞానం మరేదీ లేదు. ఇది లోపించడం వల్లనే మనుషులు అసంతృప్తితో, అశాంతితో అలమటిస్తారు. సమాజమలోనే కాదు, మనిషిలోనూ వైరుధ్యాలుంటాయి. చాలామందికి తమకు ఏం కావాలో తమకే తెలియని స్థితిలో బ్రతుకుతుంటారు. తాను ఏమిటి? తన సామర్ధ్యం ఏమితి? తను ఏలంటి లక్ష్యాల్ని ఎంచుకోవాలి? అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటి? అనే నిర్ధారణకు రాలేరు. ఇందుకు ఎంతో వివేచన ఉండాలి. మంచీచెడుల పట్ల అవగాహన ఉండాలి. ఇతరులకు వీలయినంద తక్కువ కీడు, ఎక్కువ మేలు జరిగే విధంగా వ్యవహరించాలన్న తలపు ఉండలి. తమని తాము సరిదిద్దుకోవడానికి సదా సంసిధ్ధంగా ఉండాలి. అందుకు అంతరాత్మని ప్రమాణంగా తీసుకోవాలి. ఆత్మకు విధేయంగా ఉండాలి. ఆత్మవంచనకు మించిన పిరికితనం మరోటి లేదని గ్రహించాలి. ప్రతిరాత్రి ఆత్మావలోకనం చేసుకోవాలి. తప్పయినా, ఒప్పాయినా అంతరాత్మ ముందు అంగీకరించాలి. బుకాయింపులు, సమర్ధనలు, అబద్ధాలు అవసరమే లేదు. నిజాల్ని నిర్భయంగా చెప్పాలి. తన ప్రవర్తనలో, వ్యవహార సరళిలో అపసవ్యతలుంటే సరిదిద్దుకోవాలి. ఆత్మకు జవాబుదారీగా ఉండాలి. ఇదంతా తాను ఏమిటో తెలుసుకున్న మనిషికి మాత్రమే సులువవుతుంది. తనని తాను తెలుసుకోలేని వ్యక్తి ఆత్మవంచనకీ పరవంచనకీ కూడా పాల్పడతాడు. ఆత్మజ్ఞానం తనకీ, ఇతరులకీ మేలు చేస్తుంది. మనిష్ ప్రవర్తనకి శోభనిస్తుంది.
సత్ప్రవర్తన మానవుని అన్నివిధాలా రక్షిస్తుంది. అందులో సంశయమేమీ లేదు. సత్ప్రవర్తన లేని మానవుడు మానవుడు కాదు. సత్ప్రవర్తన వలన సుఖము, లాభము, కీర్తి, శాంతి, జ్ఞానం, త్యాగం, దైవానుగ్రహం లభిస్తాయి. శాంతి, త్యాగం, దయ ఈ మూడు గుణములు మానవుడు పాటింపదగిన త్రిగుణములు.
ఉద్యోగపర్వంలో ఒకచోట భీష్ముడు "నాకు మీరు, పాండవులు ఒక్కటే. వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకిస్తే మంచిది. కీర్తి స్వర్గం కలిగిస్తుంది. వాళ్ళకు రాజ్యమిస్తే నీకు కీర్తి కలుగుతుంది". అన్నాడు. ద్రోణాచార్యులు కూడా భీష్ముడు చెప్పినట్టు చెయమని, వాళ్ళ రాజ్యభాగం తీసుకోవడం ఇంద్రుడీ కూడా చేతకాదనీ, అన్నడు. కర్ణుడు మీ ముసలి వాళ్ళ మాటలు రాజులకు మేలు కలిగించేవి కావు అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడితో "నీకు భీష్మ ద్రోణులను మించి నీ హితవు కోరేవారు ఎవ్వరూ లేరు" అన్నాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment